Kidney Stones.. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే.. శరీరంలో అన్ని అవయవాలు.. సక్రమంగా పనిచేయాలి. అప్పుడే మనిషి పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు.. శరీర అవయవాలలో ప్రధానంగా చెప్పుకునే గుండె, లివర్ తో.. పాటు శరీరంలోని అన్ని భాగాలు కూడా బాగా పనిచేయాలి. వీటిల్లో ఏ ఒక్కటి.. పనితీరులో లోపం ఉన్నా...మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన శరీర అవయవాలలో కిడ్నీ కూడా ఒకటి.. ఎందుకంటే రక్తంలో చేరుకున్న వ్యర్థ పదార్థాలన్నిటిని.. ఎప్పటికప్పుడు వడబోసి శుభ్రం చేసేది ఈ కిడ్నీలే. ఇవి విరామం లేకుండా పని చేస్తూ రక్తాన్ని శుభ్రంగా ఉంచేలా చేస్తాయి. ప్రతిరోజు 200 లీటర్ల.. రక్తాన్ని సైతం ఫిల్టర్ చేయగలవు.
ఇలాంటి కిడ్నీలో ఏదైనా సమస్య ఏర్పడితే చాలు. ఈ ప్రాసెస్ మొత్తం దెబ్బతింటుంది.. దీని ఫలితంగా మలినాలు పేరుకుపోయి.. చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సి ఉంటుంది. అందుకే కిడ్నీ సమస్యలతో.. ఇబ్బంది పడే వారికి.. ఒక దివ్య ఔషధం పాలకూర. శరీరంలో వివిధ వ్యాధులను.. సైతం నయం చేయడానికి వీటిని మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా ఈ పాలకూరకు.. విశిష్టమైన స్థానం ఉన్నది. ఈ పాలకూర కేవలం కిడ్నీలు.. ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే కాకుండా మన శరీరానికి కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది.
ముఖ్యంగా కంటి సమస్యలతో ఇబ్బందులు పడేవారు.. దగ్గు, పైల్స్, దురద, మూత్రంలో రాళ్లు ఇతరత్రా వ్యాధుల నివారణకు కూడా పాలకూర దివ్య ఔషధంలా పనిచేస్తుంది. నీటి పాలకూర కూడా అమృతం వంటిదని చెప్పవచ్చు. ఇందులో విటమిన్..A,B,C, తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ , ఫైబర్ ఇతరత్రా వంటి పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు తీవ్రమైన వ్యాధుల.. నుండి బయటపడేలా చేస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ పాలకూర ఆకుని.. మించి మరే ప్రయత్నం చేసినా కూడా వృధానే అంటూ ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
ఎలా తినాలి అంటే..?
ఈ ఆకుకూరను వేయించి తిన్నా.. లేకపోతే రసం చేసి తాగినా కూడా కిడ్నీ సమస్యలను.. దూరం చేసుకోవచ్చు. ఆకుకూరలు ఎలా తిన్నా సరే కిడ్నీ రోగాలను నయం చేయడమే కాకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేలా శరీరాన్ని కాపాడుతుంది. అందుకే వారంలో ఒకసారి కుదిరితే.. వారానికి మూడుసార్లు అయినా పాలకూర తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇక ఇలాంటి పాలకూరతో ఎటువంటి కిడ్నీ సంబంధిత సమస్యలనైనా చెక్ పెట్టవచ్చు..
Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి