Skin Care Tips: సాధారణంగా రోజువారీ జీవితంలో మనం తీసుకునే ఆహార పదార్ధాలే మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. అందుకే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ సక్రమంగా ఉండాలి. చర్మ సమస్యలకు ప్రధాన కారణం మాత్రం ఆహారపు అలవాట్లే.
మెరుగైన ఆరోగ్యం ఉండాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా ఉండాలి. డైట్ సరిగ్గా లేకుంటే ముందుగా అ ప్రభావం చర్మంపై పడుతుంది. వయస్సు రాకుండానే చర్మంపై పింపుల్స్, ముడతలు రావడం వల్ల ఏజీయింగ్ సమస్య తలెత్తుతుంది. అంటే యుక్త వయస్సుకే వృద్ధాప్యం కన్పిస్తుంది. చర్మాన్ని యౌవనంగా ఉంచేందుకు వివిధ రకాల పోషక పదార్ధాలు అవసరమౌతాయి. అన్ని రకాల పోషకాలు కావాలంటే డైట్ హెల్తీగా ఉండాలి. కొన్ని రకాల పదార్ధాలు తినడం వల్ల ఏజీయింగ్ సమస్య ఏర్పడుతుంది. అందుకే డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
కొంతమందికి ఫ్రైడ్ ఫుడ్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే రోజూ ఇలాంటి పదార్ధాలు తినడండ వల్ల చర్మానికి హాని కలుగుతుంది. ఫ్రైడ్ పదార్ధాలు, జంక్ ఫుడ్స్ వల్ల కేవలం చర్మానికి హాని కలగడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రైడ్ ఆహార పదార్దాలలను దూరం పెట్టాలి.
ఇక అన్నింటికంటే మరో ముఖ్యమైన సూచన, పంచదారకు దూరంగా ఉండటం. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పంచదార కలిపిన పదార్ధాలను తీసుకోకూడదు. అంటే స్వీట్స్ ఏవీ ముట్టుకోకూడదు. పంచదార ఎక్కువైతే చర్మం నెమ్మది నెమ్మదిగా నిగారింపు కోల్పోతుంది. పంచదారను దూరం పెడితే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
Also read: Brown Rice Benefits: బ్రౌన్ రైస్ తో ఇన్ని లాభాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook