Weight Loss Foods for Women: శరీర బరువు తగ్గించుకోటానికి తీసుకునే ఆహార పదార్థాల ఎంపిక చాలా ముఖ్యం. ఎక్కువగా తింటూ శరీర బరువు తగ్గించుకోవటం స్లిమ్ గా ఉంచే మంత్రంగా చెప్పవచ్చు. కొంత మంది శరీర బరువు తగ్గుటకు ఆహరం తీసుకోకుండా ఉంటారు, దీని వలన వారి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. కావున ఆరోగ్యకర ఆహారాన్ని తింటూ కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఎలాంటి సమస్యలు లేకుండా & ఎక్కువ సమయం కేటాయించకుండా కూడా శరీర బరువు తగ్గించుకోవచ్చు. శరీర బరువును సులభంగా తగ్గించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
గుడ్లు
అధిక ప్రోటీన్ లను కలిగి ఉండే గుడ్లను ఉదయాన అల్పాహారంగా తీసుకోవటం వలన ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. ఉదయాన గుడ్డుతో ప్రారంభించటం వలన ఇతర అనారోగ్యకర ఆహార పదార్థాలను తినటం లేదా స్నాక్స్ లను తినటం వంటి వాటికి దూరంగా ఉంటారు.
ఓట్స్
ఒకవేళ గుడ్లు తినటం మీకు నచ్చకపోతే ఓట్స్ మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇవి అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉండి, రోజు మొత్తం పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఆరోగ్యకర కార్బోహైడ్రేట్లను కలిగి ఉండి, జీవక్రియలో కొవ్వు పదార్థాలను వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.
తృణధాన్యాలు
బరువు తగ్గించుకోవాలనుకునే వారు అల్పాహారంగా తృణధాన్యాలను తీసుకోవాలి. గుడ్లు, బకాన్ వంటి వాటి నుండి అధిక క్యాలోరీలు అందించబడతాయి కానీ, అల్పాహారంగా తృణధాన్యాలను తినటం వలన తక్కువ క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి. తృణధాన్యాలు అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉంటాయి మరియు వీటిని వండటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఉదయాన తృణధాన్యాలతో పాటుగా, ఒక గ్లాసు మీగడ తీసిన పాలను తాగండి. వీటితో పాటుగా, తృణధాన్యాలు మరియు పాలు తాగిన 20 నిమిషాల తరువాత పండ్లను కూడా తినవచ్చు.
పప్పులు మరియు మూలికలు
బ్రౌన్ రైస్, బక్ వీట్ స్పాగెట్టి, డ్రైడ్ లెంటిస్, మరియు పప్పులు శరీర బరువును తగ్గిస్తాయి. మూలికలు మరియు కారపు ఆహారాలు అయినట్టి సి సాల్ట్, వెజిటేబుల్ స్టాక్ కబ్స్, ఫ్రెష్ జింజర్ రూట్, ఆనియన్ పౌడర్, అల్లం, గరమ్ మసాల, పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క మరియు ఫేనుగ్రీక్ విత్తనాలు శరీర బరువు తగ్గించుటలో సహాయపడతాయి. వీటితో మీరు తినే ఆహార పదార్థాలను కారంగా మార్చుకోండి.
బీన్స్
శరీర రక్తంలో చక్కెరలను స్థిరీకరించే కరిగే ఫైబర్ లను బీన్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి. స్త్రీలలో బరువు తగ్గించుటను వేగవంతం చేసే ప్రోటీన్ మరియు పోషకాలను బీన్స్ అధికంగా కలిగి ఉంటాయి.
సిట్రస్ జాతికి చెందిన పండ్లు
నారింజ మరియు ద్రాక్ష పండ్లు సిట్రస్ జాతికి చెందిన పండ్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి కరిగే ఫైబర్ లను మాత్రమే కాకుండా విటమిన్ 'C'ని కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్ శరీరంలో ఐరన్ ను గ్రహించుకోవటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆపిల్ లో ఉండే పోషకాలు మరియు ఫైబర్ స్థాయిలు పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి.
నట్స్
నట్స్ అనేవి ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమేకాకుండా, ఆకలిని తగ్గించే అణచివేచే కారకాలను కూడా కలిగి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను కలిగి ఉండి, శరీరం స్లిమ్ గా అయ్యేలా చేస్తాయి. బాదంపప్పులు, ఆకలిగా ఉన్నపుడు పిడికెడు వేరుశెనగ, బాదంపప్పు మరియు అక్రోటుకాయలని తినటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రమేకాకుండా, ఆకలి తగ్గుతుంది.
గ్రీన్ టీ
రోజు గ్రీన్ టీ తాగటం వలన మీ శరీర బరువులో కలిగే వ్యత్యాసాలను మీరే గమనించవచ్చు. గ్ర్రీట్ టీ లో ఉండే హైడ్రేట్లు, నీటి స్థాయిలు ఆకలి అవుకుండా చేస్తాయి. వీటితో పాటుగా గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాలోరీలను మరియు కొవ్వు పదార్థాలను కరిగించి వేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి