Healthy Winter Drinks In Telugu: ప్రస్తుతం చలి కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా చాలా మందిలో ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. శీతాకాలంలో శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే చలికాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటే తప్పకుండా డ తీసుకోవాల్సి ఉంటుంది.
కొబ్బరి నీరు:
ఎండాకాలం లాగే చాలా మందిలో హైడ్రేషన్ సమస్యలు వస్తాయి. దీని కారణంగా ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ మొదలైన జీర్ణ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ గ్రీన్ టీని తీసుకోవడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాల చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. దీంతో పాటు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
హెర్బల్ టీ:
హెర్బల్ టీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చలికాలంలో ఈ హెర్బల్ టీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తులసి, అల్లంతో చేసిన హెర్బల్ టీని తాగితే శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
నిమ్మకాయ రసం:
చలికాలంలో చాలా మంది తక్కువ నీటిని తాగుతూ ఉంటారు. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య వస్తాయి. అంతేకాకుండా కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు నిమ్మ రసం తాగాల్సి ఉంటుంది. ఈ రసం ప్రతి రోజు తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter