Heart Attack: అధిక రక్తపోటు ఎలా అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది?

Heart Attack Symptoms: అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ అనేవి రెండు ప్రధాన గుండె సంబంధ వ్యాధులు. ఇవి ఒకదానికొకటి సంబంధించినవి. అయితే వ్యాధుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనేది మనం తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 10, 2024, 12:20 PM IST
Heart Attack: అధిక రక్తపోటు ఎలా అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది?

Heart Attack Symptoms: ప్రస్తుతకాలంలో చాలా మందిని బాధించే సమస్యలో అధిక రక్తపోటు ఒకటి. ఈ సమస్య కరణంగా గుండె సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అధికరక్తపోటు గల కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో  జన్యుపరమైన కారణాలు, అధిక బరువు, ధూమపానం, అధిక ఉప్పు తీసుకోవడం, శారీరకంగా చురుకుగా లేకపోవడం, మద్యం అధికంగా తాగడం, ఒత్తిడి, కొన్ని మందులు మొదలైనవి అధిక రక్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. చాలా మందిలో అధిక రక్తపోటుకు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతమందిలో తలనొప్పి, ముక్కు రక్తం కారడం, చెవుల్లో శబ్దాలు వినిపించడం, దృష్టి మబ్బుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

అయితే అధిక రక్తపోటు ఎలా అథెరోస్క్లెరోసిస్‌కు దారితీస్తుంది. ఇది వయస్సు పెరగడం, ఊబకాయం, పొగాకు వాడకం, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు వంటివి అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు. అంతేకాకుండా అధిక రక్తపోటు కారణంగా ధమనుల లోపలి పొరకు నిరంతరం ఒత్తిడి వస్తుంది. దీని వల్ల ధమనుల లోపలి పొర దెబ్బతింటుంది. ఈ దెబ్బతిన్న ప్రాంతాలకు కొవ్వు, కొలెస్ట్రాల్ వంటి పదార్థాలు అతుక్కొని ఫలకాలు ఏర్పడతాయి. ఈ ఫలకాలు క్రమంగా పెరిగి ధమనులను ఇరుకు చేస్తాయి. అథెరోస్క్లెరోసిస్ వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఇరుకుగా మారతాయి. ఫలితంగా గుండెకు సరిపడా ఆక్సిజన్ పోషకాలు అందవు. కొన్ని సందర్భాల్లో ఈ ఫలకాలు పగిలి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెకు రక్త ప్రవాహం పూర్తిగా అంతరించి గుండెపోటు వస్తుంది.

అధిక రక్తపోటు అథెరోస్క్లెరోసిస్‌ను ఎలా నివారించవచ్చు:

ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలాంటి అనారోగ్యసమస్యలైనా త్వరాగా తగ్గిస్తుంది. అథెరోస్ల్కెరోసిస్‌ను  ఉన్నవారు  తక్కువ ఉప్పు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు వంటి ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మంచిది. వీటితో పాటు ధూమపానం మానేయడం. ఒత్తిడితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవడం, వైద్యుడి సలహా మేరకు మందులు వాడడం. అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఈ రెండింటినీ నిర్వహించడానికి జీవనశైలిలో మార్పులు చేయడం చాలా అవసరం.

గమనిక: 

మీకు అధిక రక్తపోటు ఉందని అనుమానిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వారి సలహాలను పాటించండి.

ఇది కూడా చదవండి: Ulli Masala: ఇంట్లో ఏమి కూర చేయాలో తోచనపుడు ఇలా ఉల్లి మసాలా కూర చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News