High Cholesterol: ఈ చిన్న 3 చిట్కాలతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగడం ఖాయం..

High Cholesterol: కొలెస్ట్రాల్‌ పరిమాణాలు అధిక పరిమాణాల్లో పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 05:52 PM IST
High Cholesterol: ఈ చిన్న 3 చిట్కాలతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగడం ఖాయం..

High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే..అయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల వస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె పోటు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా కొవ్వును నియంత్రించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగా మారోచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటితో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌..
1. పసుపు:

పసుపు ఆహారాల రంగును పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో కర్కుమిన్ ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారాల్లో వినియోగించడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది.

2. నల్ల మిరియాలు:
నల్ల మిరియాలు సీజనల్‌ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే చాలా మంది పెప్పర్‌ అతిగా వినియోగిస్తారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

3. దాల్చిన:
దాల్చిన చెక్కను మసాలా దినుసుల్లో వినియోగిస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలిక గుండె జబ్బుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు ఇన్సులిన్ ఉత్పత్తి సమర్థవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇదేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?

Also read: Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News