Corona Pandemic: కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలకై అణ్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పాత అలవాట్లు మళ్లీ తెరపైకొస్తున్నాయి. అందులో ముఖ్యమైంది పసుపు పాలు.
కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. దేశంలో రోజుకు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా శరీరంలోని ఇమ్యూనిటీని (Immunity) తక్షణం పెంచుకోవల్సి ఉంది. దీనికోసం రోజువారీ ఆహారపదార్ధాల్లో కాస్త మార్పులు చేస్తే చాలు. ముఖ్యంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకుంటే చాలు. రోజూ పాలు తాగే అలవాటున్నవారు కాస్త పసుపు జోడించి తీసుకుంటే మంచి ప్రయోజనముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలలో శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆరోగ్యానికి దోహదపడుతాయి.
వాస్తవానికి ఇది కొత్త చిట్కా కానేకాదు. పూర్వకాలంలో ఉన్నటువంటి అలవాటే. ఆధునిక జీవనశైలిలో చాలా రకాల పాత అలవాట్లను మర్చిపోయాం. ఇప్పుడీ పాత అలవాటే ఇప్పుడు అవసరమౌతుంది. కరోనా మహమ్మారి నేపధ్యంలో పాలలో పసుపు కలుపుకుని తాగడం మరోసారి అలవాటు చేసుకుంటున్నారు. దగ్గు, జలుబు ఉన్నప్పుడు పసుపు పాలు మంచి ఉపశమనం కల్గిస్తాయి. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవారికి కూడా పసుపు పాలు చాలా మంచిదంటున్నారు వైద్య నిపుణులు. పాలలో ఉండే సెరటోనిన్, మెలటోనిన్‌లు పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తగ్గిస్తాయి. హాయిగా నిద్రపడుతుంది.
పసుపు పాలు (Turmeric Milk)వైరస్ దాడి నుంచి మన కాలేయానికి సంరక్షణ కల్పిస్తాయి. ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటివాటిని తగ్గిస్తుంది. పసుపు పాలలో కాలేయంలో చేరే విషకారకాల్ని నాశనం చేసే గుణాలున్నాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ కారణంగా శరీరంలో వైరస్ అభివృద్ధి ఆగుతుంది. మహిళలల్లో రుతుక్రమం సమయంలో ఎదురయ్యే పొత్తి కడుపు నొప్పి, ఇతర నొప్పులు దూరమౌతాయి. నీళ్ల ద్వారా శరీరంలో చేరుకునే వైరస్ త్వరగా అభివృద్ధి చెందకుండా అంటే మల్టిప్లై కాకుండా చేసే గుణం పసుపులో ఉంది.
Also read: Omicron Variant Twice: ఒకే వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎన్నిసార్లు సోకుతుందో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.