Zycov D Vaccine: తొలి మేకిన్ ఇండియా చిల్డ్రన్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుంది. కేంద్ర ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చింది. మరో వారం రోజుల్లో చిల్డ్రన్ వ్యాక్సినేషన్ ప్రారంభం కావచ్చని అంచనా.
కోవిడ్ మహమ్మారి నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. ఇండియాలో పిల్లలకు తప్పించి..అంటే 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ముఖ్యంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. అది కూడా తొలి మేకిన్ ఇండియా చిల్డ్రన్ వ్యాక్సిన్ కావడం విశేషం. ఇండియాలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు సైతం ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే. గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్ ఇది. మిగిలిన వ్యాక్సిన్లకు జైకోవ్ డికు చాలా వ్యత్యాసముంది. మిగిలిన వ్యాక్సిన్లు రెండు డోసులు ఇవ్వాల్సి వస్తే..జైకోవ్ డి (Zycov D Vaccine)మాత్రం 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. జైకోవ్ డి సూది లేకుండా ఇంజెక్టర్ ద్వారా ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ కూడా.
డీసీజీఐ(DCGI) అనుమతి పొందడంతో జైకోవ్ డి కోటి వ్యాక్సిన్ డోసులకు కేంద్ర ప్రభుత్వం(Central government) ఆర్డర్ ఇచ్చింది. కంపెనీ నుంచి కోటి వ్యాక్సిన్ డోసులు అందిన వెంటనే దేశంలో చిన్న పిల్లలకు అంటే 12 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వ సంస్థ డీసీజీఐ అనుమతి పొందింది. కంపెనీ వద్ద ఉన్న పరిమితమైన వనరుల దృష్ఠ్యా నెలకు కోటి డోసులు మాత్రం సంస్థ ఉత్పత్తి చేయగలదు. వ్యాక్సిన్ డోసుకు పన్నులు మినహాయించి ఒక్కొక్క డోసుకు 358 రూపాయల ఖర్చుకానుంది. మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల తరువాత 2వ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత 56వ రోజున మూడవ డోసు ఇవ్వాలి. సూది లేకుండా ప్రత్యేకమైన ఇంజక్టర్తో ఇచ్చే వ్యాక్సిన్ కావడంతో..ఇంజెక్టర్ ఖర్చుతో కలిపి ఒక్కొక్క డోసుకు 358 రూపాయలవుతోంది.
Also read: Duplicate Alcohol: కల్తీమద్యం ఎలా తయారు చేస్తారు, ఎందుకు విషమవుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి