Indigestion Symptoms: మంచి ఆరోగ్యానికి మెరుగైన జీవక్రియ ఎంతో అవసరం. ఈ మాట మనం ఎప్పుడూ ఇంట్లో వింటూనే ఉంటాం. ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణులు కూడా ఏకీభవిస్తారు. చాలామంది ఎంత తిన్నా లావు కారు..మరి కొంత మంది కొంచొం తిన్నా ఇట్టే లావు అవుతారు. ఎన్ని ఎక్ససైజ్ లు డైటింగ్ లు చేసినా ఒక పట్టాన ఒళ్ళు తగ్గరు. దీని వెనుక అసలు కారణం మన శరీరంలో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం అని మీకు తెలుసా? జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయక శరీరంలో అవసరమైన పోషకాలను అది విచ్చిన్నం చేసే అవకాశం ఉంది. దీనినే మనం పెద్దప్రేగు అని కూడా పిలుస్తాము.
మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత పెద్దప్రేగుకుండా వ్యర్ధాలు బయటకు వెళ్తాయి. ఎక్కువ నూనె లేక అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్స్ లాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మనం తరచూ అజీర్తి ఎదుర్కొంటాం. అంటే మనం తీసుకున్న అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ప్రేగులలో వ్యర్ధాలు మిగిలిపోతాయి. ఇలా మిగిలిన వ్యర్ధాలు అక్కడే కుళ్ళి తీవ్రమైన అస్వస్థతకు మనల్ని గురిచేస్తాయి. ఇదే రకంగా తరచూ జరుగుతూ ఉంటే మనం తీసుకున్న ఆహారం శరీరానికి శక్తిని అందించకుండా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి ఒబెసిటీ సమస్యలు తలెత్తుతాయి.
ఈ సమస్యలను మనం సకాలంలో కనుక్కొని జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందామా..
ఆకలి లేకపోవడం:
కొందరికి ఎక్కువగా ఆకలి వేయదు.. ఎప్పుడు కడుపులో ఏదో ఉబ్బరంగా.. అసౌకర్యంగా ఉంటుంది. మీ జీర్ణ వ్యవస్థలో ఆటంకం ఏర్పడుతుంది అనడానికి ఇదే మొదటి సంకేతం. పెద్ద ప్రేగులలో పురుగులు ఏర్పడినప్పుడు మొదట వచ్చే లక్షణం ఆకలి మందగించడం.
నాలికపై తెల్లటి పూతలు:
మన నాలిక మన ఆరోగ్యానికి అర్థం వంటిది. అందుకే ఎప్పుడూ నాలికను చూసి వైద్యులు మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఒకవేళ మీ నాలికపై తెల్లని మచ్చలు లేక పొరలాంటిది ఏర్పడినట్లయితే.. పెద్ద ప్రేగులో ఏదో సమస్య మొదలయ్యిందని అర్థం. కడుపులో బ్యాక్టీరియా చేరడం లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు నాలికపై అలా మచ్చలు కనిపిస్తాయి.
కడుపు నొప్పి:
జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని వాళ్లకు తరచుగా ఏమి తిన్నా కడుపులో నొప్పి వస్తుంది. కాస్త మసాలా తిన్నా వికారం కలగడం.. కడుపు ఉబ్బరంగా అనిపించడం వీరిలో కనిపించే సహజ లక్షణాలు. ఇవి తరచుగా వస్తూ ఉంటే ఒకసారి ప్రేగులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
స్కిన్ ప్రాబ్లమ్స్:
మన జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే దాని నీరు ప్రభావం మన చర్మం మీద పడుతుంది. మొఖం మీద మచ్చలు, మొటిమలు రావడం జీర్ణవ్యవస్థలో తలెత్తిన లోపాల కారణంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి చర్మం పొడిబారినట్టుగా అవ్వడం.. నిర్జీవంగా కనిపించడం.. మొదలైనవి తరచుగా మనం గమనించవచ్చు.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook