Jaggery Tea is Good for Diabetes: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మధుమేహ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు లేని కారణంగా రక్తంలో షుగర్ నానాటికి పెరిగే అవకాశం ఉంది. దీంతో అలాంటి వారు.. తాము తినే ఆహారంలో తీపి పదార్థాలు లేకుండా చూసుకోవాలి. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు.. టీ తాగే అలవాటు ఉన్న వారు బెల్లం ఉపయోగించవచ్చో లేదో తెలుసుకుందాం.
పంచదార కంటే బెల్లం మేలు..
డయాబెటిస్ తో బాధపడే వారికి బెల్లం టీ ప్రయోజనకరంగా మారుతుంది. అయితే అందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీ తాగే వాళ్లకు పంచదార కంటే బెల్లం ఎక్కువ మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. బెల్లంలో ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్లు, ఖనిజాలు చాలా ఉంటాయి. శీతాకాలంలో బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఏర్పడుతుంది. బెల్లం టీ తాగడం వల్ల శీతాకాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చని అనుభూతిని కలిగిస్తుంది.
బెల్లం టీ రక్తంలో చక్కెరను పెంచుతుందా?
డయాబెటిస్ పేషెంట్లు బెల్లం టీ తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు పెద్దగా హాని జరగదని చెబుతున్నారు. కానీ, టీలో బెల్లం చాలా తక్కువ మోతాదులో వినియోగించాలి.
షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి!
షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సలహా లేకుండా వేటినీ తినొద్దు.
డయాబెటిక్ పేషెంట్లు ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లు తినడం వల్ల మేలు కలుగుతుంది.
ఆహారాన్ని మితంగా తినడం వల్ల రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రించుకోవచ్చు.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!
Also Read: Mango Benefits: రోజూ మామిడి పండు తినడం వల్ల ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook