Milk with Tulsi: పాలల్లో తులసిని కలిపి తీసుకుంటే... ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు...

Side effects of drinking Milk with Tulsi: చాలామందికి పాలు తులసి కలిపి తీసుకునే అలవాటు ఉంటుంది. దీని ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. అయితే ఇలా చేయడం ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి... అవేంటో తెలుసుకోండి

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 11:28 AM IST
Milk with Tulsi: పాలల్లో తులసిని కలిపి తీసుకుంటే... ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు...

Side effects of drinking Milk with Tulsi: పాలు సంపూర్ణ పోషకాహారం అనేది అందరికీ తెలిసిందే. పాలను తులసి ఆకులతో (Tulsi Milk) కలిపి తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) ఉంటాయని చాలామంది విశ్వసిస్తారు. తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు పాలల్లోని పోషకాహారంతో కలిసి శరీరాన్ని పలు రుగ్మతల నుంచి కాపాడుతుందని భావిస్తారు. అయితే పాలు, తులసి కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి క్షేమమేనా అంటే... దానివల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పాలు, తులసి కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. తులసిలో (Tulsi Benifits)యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. నిజానికి ఇవి చాలా వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతాయి. అయితే తులసి ఆకులను వేడి పాలలో తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అది మీ వ్యాధిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది.

పాలలో ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, కాపర్, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలల్లో తులసిని కలిపి తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలు, తులసి కలిపి తీసుకోకపోవడం మంచిది. 

రక్తస్రావం సమస్యలు తలెత్తవచ్చు..

మీరు బ్లడ్ థినర్స్ మెడిసిన్ తీసుకునేవారు తులసిని పాలతో కలిపి తీసుకోవద్దు. ఒకవేళ అలా తీసుకుంటే ఇది రక్తస్రావం సమస్యలకు దారితీస్తుంది.

స్పెర్మ్ కౌంట్ తగ్గవచ్చు

పాలతో కలిపి తులసిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది.

షుగర్ ఉన్నవారు జాగ్రత్త

మీరు షుగర్ వ్యాధికి మెడిసిన్ వాడుతున్నట్లయితే, తులసిని పరిమితంగా తీసుకోవాలి. లేనిపక్షంలో ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని చాలావరకు తగ్గిస్తుంది.

తులసిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. తులసి ఆకులు వాడే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. వేడి వేడి పాలల్లో తులసి ఆకులు (Tulsi Health Benifits) లేదా వాటి రసాన్ని ఉపయోగించవద్దు. అలా చేస్తే పాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే, చాలా రోజుల క్రితం తెంపిన తులసి ఆకులను ఉపయోగించవద్దు. సాధారణంగా తులసిని పాలతో కాకుండా నేరుగా తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు వంటి వాటికి మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. అయితే పాలల్లో తీసుకునే విషయంలో మాత్రం పైన చెప్పుకున్న జాగ్రత్తలు అవసరం.

(నిరాకరణ: ఇక్కడ ఇచ్చిన సూచనలను ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు. కాబట్టి ఈ సూచనలు స్వీకరించే ముందు, కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి.)

Also Read: Drumsticks Record Price: ఆకాశాన్నంటిన మునగకాయ ధర.. కిలో ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News