Lady Finger Benefits: బెండకాయతో బ్యూటీ.. జుట్టు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు..

Lady Finger Beauty Benefits:  బెండకాయలో విటమిన్స్‌, మినరల్స్‌, విటమిన్‌ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది స్కిన్‌ డ్యామేజ్‌ అవ్వకుండా ఫ్రీ ర్యాడికల్ నుంచి కాపాడుతుంది. దీంతో మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jul 19, 2024, 03:48 PM IST
Lady Finger Benefits: బెండకాయతో బ్యూటీ.. జుట్టు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు..

Lady Finger Beauty Benefits: బెండకాయ పోషకాలకు పవర్‌హౌజ్‌. ఇది డయాబెటీస్‌ వారికికూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా దీంతో జుట్టు చర్మానికి ఉపయోగకరంగా ఉంటుంది.అయితే, ఈ బెండకాయతో ఫేస్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  మీ డైలీ స్కిన్‌కేర్‌ రొటీన్‌లో బెండకాయ చేర్చుకుంటే ప్రయోజనాలు తెలుసుకుందాం.

మెరిసే ముఖం..
బెండకాయలో విటమిన్స్‌, మినరల్స్‌, విటమిన్‌ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది స్కిన్‌ డ్యామేజ్‌ అవ్వకుండా ఫ్రీ ర్యాడికల్ నుంచి కాపాడుతుంది. దీంతో మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.

యాంటీ ఏజింగ్‌..
బెండకాయను మాస్క్‌ మాదిరి వేసుకోవడం వల్ల  ముఖంపై మచ్చలు, గీతలు తగ్గిపోతాయి.  తరచూ బెండకాయను అప్లై చేయడం వల్ల చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బెండకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.

క్లీయర్‌ స్కిన్..
బెండకాయంలో విటమిన్ ఏ ఉంటుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇది ముఖం యాక్నే పెరగకుండా ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. 

హైడ్రేషన్‌..
బెండకాయంలో హైడ్రేటింగ్‌ గుణాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఎక్కువ శాతం నీరు ఉంటుంది. చర్మానికి హైడ్రేషన్‌ అందిస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

కొల్లాజెన్‌ ఉత్పత్తి..
బెండకాయ కూరగాయ దీన్ని తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. చర్మాన్ని సాగేలా చేసి మెత్తగా మారుస్తుంది.

ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..

జుట్టు..
బెండకాయ కేవలం చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో మన జుట్టుకు ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. బెండకాయ హెయిర్‌ ఫోలికల్స్‌ దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టు ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.

డ్యాండ్రఫ్..
బెండకాయ డ్యాండ్రఫ్ కు చెక్‌ పెడుతుంది.ఇది కుదుళ్లను ఆరోగ్యంగా మారుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.

అందమైన గోళ్లు..
బెండకాయలో బయోటిన్‌ కూడా ఉంటుంది. ఇది గోళ్లు ఆరోగ్యవంతంగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. బయోటిన్ గోళ్లు పెరగడానికి విరగకుండా ఉండేలా సహాయపడుతుంది.

ఇదీ చదవండి:  ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..

నేచురల్‌..
బెండకాయ జుట్టుకు నేచురల్‌ చికిత్స అందిస్తుంది. బెండకాయను నీటిలో వేసి మరిగించండి ఆ తర్వాత కాసేపు చల్లారనివ్వండి ఈ జెల్‌ను జుట్టుకు మాస్క్‌ మాదిరి వేసుకోవాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News