Lose Weight In 7 Days: బరువు తగ్గాలంటే వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే చాలా మంది బరువు పెరిగే క్రమంలో వివిధ రకాల ఆహారాలను తీసుకుంటున్నారు. వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారపు నియమాలు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో తెలుసుకుందాం.
ఈ అలవాట్ల వల్లే బరువు పెరుగుతున్నారు:
1. ఔషధాలు అధిక పరిమాణంలో తిసుకోవద్దు:
బరువు తగ్గే క్రమంలో చాలా మంది ఔషధాలు అధిక పరిమాణంలో వినియోగిస్తున్నారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా వినియోగిస్తే.. దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా దీనిని దృష్టిలో పెట్టుకోవాలి.
2. సరైన పరిమాణం సరైన ఆహారం తీసుకోండి:
బరువు తగ్గడానికి క్యాలరీలు ప్రధన పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గడానికి ఇవి ప్రధానం కనుక తప్పకుండా వీటి పరిమాణాలపై దృష్టి సారించాలి. కేలరీలు చాలా తక్కువగా ఉండే ఆహారాలను అలవాటు చేసుకోవాలి. డైట్‌ని కంట్రోల్ చేయడంతోపాటు టైంకు ఆహారాన్ని తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఆకలిని కూడా సులభంగా నియంత్రిస్తుంది. కావున తప్పని సరిగా బరువు తగ్గాలనుకునే వారు కేలరీలు తక్కువున్న ఆహారాలను తీసుకోవాలి.
3. ఉప్పు, చక్కెరకు దూరంగా ఉండడం చాలా మంచిది:
బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత మంచిదో..చక్కెర, ఉప్పు తీసుకోకపోవడం కూడా అంతే మంచిది. బరువు తగ్గే క్రమంలో కేవలం 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook