Prostate Cancer Symptoms: పురుషులలో పెరుగుతున్న ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ సమస్యలు..!

Prostate Cancer Symptoms: ప్రోస్టేట్ అనేది పురుషులకు మాత్రమే ఉండే ప్రత్యేక గ్రంథి. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో ప్రోస్టేట్ సమస్యలు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 11:17 AM IST
  • పురుషులలో పెరుగుతున్న ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్
  • మారుతున్న జీవన శైలి కారణంగా ఈ సమస్యలు
  • దీని లక్షణం ముత్రంలో మంటలు
Prostate Cancer Symptoms: పురుషులలో పెరుగుతున్న ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ సమస్యలు..!

Prostate Cancer Symptoms: ప్రోస్టేట్ అనేది పురుషులకు మాత్రమే ఉండే ప్రత్యేక గ్రంథి. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో ప్రోస్టేట్ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల కారణంగా  మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి సమస్య ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమంది ప్రోస్టేట్ సంక్రమణను ప్రోస్టేట్ క్యాన్సర్‌గా కూడా పిలుస్తారు. తరచుగా ముత్రంలో మంటలు వస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు:

1. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉంటే..మూత్రం పోసేటప్పుడు మంట లేదా నొప్పిగా అనిపిస్తుంది.

2.  ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే..వాంతులు లేదా వికారంతో సమస్యలు కలగవచ్చు.

3. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ సమస్య ఉంటే, శరీర భాగాల్లో నొప్పుల వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

4. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు జ్వరం లేదా చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

5. లోయర్ బ్యాక్ లేదా పొత్తికడుపు నొప్పి సమస్య కూడా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణం.

ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి?:

- బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు వస్తాయి. అంతేకాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

- STD వంటి వ్యాధుల వల్ల కూడా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు.

- శస్త్రచికిత్స లేదా వైద్య ప్రక్రియ కారణంగా కూడా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స:

1. ఈ సమస్యతో బాధపడుతున్న వారు పసుపు కలిపిన పాలను తాగాలని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు.

2. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నందునా.. ఈ ఇన్ఫెక్షన్‌ నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు.

3. ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ సమస్యను అధిగమించడానికి కెగెల్ వ్యాయామాలు చేయవచ్చు. ఇది మీ మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పని చేయండి..!

Also Read: Skin Care: చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..ఈ చిట్కాలను పాటించండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News