Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా పెరగడానికి సులువైనా 3 చిట్కాలు ఇవే..

Reduce Cholesterol Without Medicine: రక్తంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర బరువు కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2023, 12:06 PM IST
Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా పెరగడానికి సులువైనా 3 చిట్కాలు ఇవే..

How To Reduce Cholesterol Without Medicine In 8 Days: కొలెస్ట్రాల్ రక్తంలోని సిరల్లో పేరుకుపోతుంది. అయితే వాటి స్థాయిలు అధికంగా పెరగడం వల్ల రక్త ప్రవాహంలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా చాలా మందిలో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడా ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను ఈ మార్గాల్లో నియంత్రించుకోండి:
ట్రాన్స్ ఫ్యాట్‌కు దూరంగా ఉండండి:

కేక్, చిప్స్, పాప్‌కార్న్, పిజ్జా, ఫ్రైడ్ ఫుడ్ వంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ అధిక పరిమాణంలో ఉంటుంది.. ఇవి కొలెస్ట్రాల్‌ని పెంచడానికి దోహదపడతాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది.

పండ్లు, కూరగాయలను తీసుకోండి:
కొలెస్ట్రాల్‌ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆహారంలో పండ్లు, కూరగాయలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే పీచు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో కూరగాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి బాడీని కూడా రక్షిస్తాయి.

శుద్ధి చేసిన పిండి:
శుద్ధి చేసిన పిండి ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇదే

Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News