5 Health Risks of Eating Too Fast: మనం ప్రతిరోజు మూడు పూటల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెద్దలు చెబుతూ ఉంటారు. అవును ఇది నిజమే ప్రతిరోజు మూడు పూటలు ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.. అయితే మూడు పూటలు ఆహారం తినే క్రమంలో చాలామంది కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల కారణంగానే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తినే క్రమంలో చాలామంది త్వర త్వరగా ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నమలడం కూడా మానుకుంటున్నారు. ఇలా త్వర త్వరగా ఆహారాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు త్వర త్వరగా ఆహారాలు తీసుకునే వారిలో జీర్ణ క్రియ తొందరగా దెబ్బతింటుంది. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి త్వర త్వరగా ఆహారాలు తీసుకునేవారు తప్పకుండా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఆహారం తీసుకునే క్రమంలో తప్పకుండా 20 నిమిషాల పాటు ఆహారాలను తినేందుకు కేటాయించాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
త్వర త్వరగా ఆహారాలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే:
- ఫాస్ట్ గా ఆహారాలు తీసుకునే వారిలో సులభంగా జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలే కాకుండా పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- అంతేకాకుండా చాలామందిలో ఊబకాయం సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఆహారం తీసుకునే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
- ప్రతిరోజు త్వర త్వరగా ఆహారాలు తీసుకోవడం వల్ల చాలామందిలో మధుమేహం సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- ఫాస్ట్ గా కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర గుండెపోటు సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి