Health Benefits of Rock Salt: పూర్వీకులు ఎక్కువగా వంటకాల్లో రాక్ సాల్ట్‌నే వినియోగించేవారు. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా అంతా మరిపోయింది. అందరూ సాధరణ ఉప్పును వినియోగించడానికి అలవాటు పడ్డారు. అయితే రాక్ సాల్ట్‌లో శరీరానికి కావాల్సిన ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రాక్‌సాల్ట్‌ను అతిగా వినియోగించడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సాల్ట్‌ను వినియోగించడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాక్ సాల్ట్ ప్రయోజనాలు:-
1. మినరల్స్ సమృద్ధిగా:
ఒక టేబుల్ సాల్ట్‌లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరాన్ని అభివృద్ధి చేసే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
2. తక్కువ సోడియం కంటెంట్:
ఇతర సాల్ట్‌తో పోలిస్తే రాక్ సాల్ట్‌లో తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో వినియోగిస్తే అధిక రక్తపోటు ఇతర సమస్యలతో బాధపడేవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
3. జీర్ణక్రియ సమస్యలకు చెక్:
రాక్ సాల్ట్‌లో తక్కువ రసాయనాలు ఉంటాయి. కాబట్టి సులభంగా ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అయితే చాలా మంది ప్రస్తుతం పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో రాక్ సాల్ట్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Hibiscus Flower Benefits: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్, బీపీకి శాశ్వతంగా చెక్!
4. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం:
రాళ్ల ఉప్పును నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
5. చర్మ సమస్యలకు చెక్:
రాక్ సాల్ట్‌లో ఎక్స్‌ఫోలియేటింగ్, డిటాక్సిఫైయింగ్ లక్షణాల కారణంగా చర్మాన్ని సంరక్షిస్తుంది. అంతేకాకుండా ఈ సాల్ట్ చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మంపై రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి సహాయపడుతుంది.
Also Read: Weight Loss Diet: బరువు తగ్గడానికి రోటీ బెటరా, రైస్ బెటరా? ఎలా వెయిట్ లాస్ అవుతారో తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook