Sravana Somavaram vratam: శ్రావణ సోమవారం రోజు వ్రతం ఆచరించడం, పూజలు చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజున ఆరోగ్యం గురించి శ్రద్ధ చాలా అవసరం. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
శ్రావణ మాసంలో తొలి సోమవారం లేదా ప్రతి సోమవారం నాడు వ్రతం ఆచరిస్తుంటారు. ఉపవాసాలుంటారు. శివుడి కటాక్షం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరమంటున్నారు జ్యోతిష్య పండితులు. వ్రతం సందర్భంగా కొన్ని విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే..అనారోగ్యం వెంటాడవచ్చంట.
హిందూమతంలో శ్రావణ సోమవారం వ్రతానికి ప్రత్యేక మహత్యముంది. భక్తులు పెద్ద సంఖ్యలో వ్రతం ఆచరిస్తూ..శివుడి పూజ చేస్తారు. శ్రావణంలో శివుడిని ప్రసన్నం చేసుకుంటే..అన్ని కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. హిందూమతంలో ఈ వ్రతానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. వ్రతం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. కానీ ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
వ్రతం ఆచరించేటప్పుడు డైట్‌ఛార్ట్ సరిగ్గా ఉండాలి. వ్రతం సందర్భంగా కివీ, పైనాపిల్ వంటి పండ్లు తినవచ్చు. వీటివల్ల విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఎనర్జీ పెరుగుతుంది. వర్షాకాలంలో ఫ్లైడ్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. సగ్గుబియ్యం కిచిడీ ఆరోగ్యానికి మంచిది. కానీ కుట్టు పిండి వంటలకు దూరంగా ఉండటం మంచిది. శ్రావణ మాసంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినే ఆహార పదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తపోటు సమస్య ఉండేవాల్లు..సగ్గుబియ్యం పదార్ధాలు తీసుకోవాలి. ఇక మరోవైపు డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు ఎక్కువ నీళ్లు తాగాలి. చల్లని నీటిలో విమ్మకాయ, ధనియా పౌడర్, పుదీనా పౌడర్ వేసి డీటాక్స్ డ్రింక్ తాగితే మంచి ఫలితాలుంటాయి.
ఎక్కవ సేపు ఖాళీ కడుపుతో ఉండటం వల్ల తలనొప్పి, బలహీనత, తల తిరగడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే అజీర్తి సమస్యయ రావచ్చు. అందుకే వ్రతం ఆచరించేటప్పుడు ఇలాచీ, సోంపు తినాలి. వీటివల్ల మెటబోలిజం మెరుగుపడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్థులు ఈ వ్రతానికి దూరంగా ఉంటే మంచిది. డయాబెటిస్ రోగులు మందులు తీసుకునే అలవాటుండటం వల్ల ఎక్కువ సేపు ఏం తినకుండా ఉండకూడదు. అందుకే వ్రతం ఆచరించేముందు వైద్యుడిని సంప్రదించాలి. వ్రతం సందర్భంగా నిమ్మరసం, డ్రింక్స్ తాగవచ్చు. డయాబెటిస్ ఉంటే మాత్రం వ్రతానికి దూరంగా ఉంటేనే మంచిది.
Also read: Mangala Gauri Vratam: శ్రావణంలో మంగళ గౌరి వ్రతం ఎందుకుంటారు, ఆ వ్రతం కధేంటి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook