Refreshing Summer Drinks To Lose Weight, Belly Fat: ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడం వల్ల ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారు. పెరుగుతున్న బరువు కారణంగా చాలా మందిలో అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎంత సులభంగా బరువు తగ్గించుకుంటే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే అవకాశాలున్నాయి. కాబట్టి వీలైనంత తొందరగా ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవిలో పలు రకాల డ్రింక్స్ తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి డ్రింక్స్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో బరువు తగ్గాలంటే ఈ జ్యూస్‌లు తాగండి:
ఆరెంజ్ జ్యూస్:
ఆరెంజ్‌లో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ డ్రింక్‌ను వేసవి కాలంలో ఎక్కువగా తాగడం వల్ల సులభంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఎంతటి బరువునైన నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తాజాగా నారింజ పండ్ల నుంచి తీసిన రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కూడా గురి కాదు. కాబట్టి వేసవి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నారింజ పండ్ల రసాన్ని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
దోసకాయ జ్యూస్:
చాలా మంది వేసవి కాలంలో దోసకాయ తినడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా ఎండా కాలంలో దోసకాయలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా, రిఫ్రెష్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దోసను ప్రతి రోజూ తినడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం మీరు దోసకాయను ఒక వాటర్ బాటిల్ నీటి పోసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్స్ చేసుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరం డిటాక్స్ అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా సులభంగా నియంత్రస్తాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!
ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే
ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook