Horse Gram Legume: బరువు పెరగడం, మధుమేహానికి ఉలవ పప్పుతో చెక్‌ పెట్టొచ్చు...

 Weight Loss Diabetic Patients: ఉలవ పప్పు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహం, శరీర బరువు సమస్యలతో బాధపడుతున్నవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 09:22 AM IST
Horse Gram Legume: బరువు పెరగడం, మధుమేహానికి ఉలవ పప్పుతో చెక్‌ పెట్టొచ్చు...

Horse Gram Legume For Weight Loss Diabetic Patients: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధునిక జీవన శైలిని అనుసరించే చాలా మందిలో మధుమేహం, శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడిన వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రతి రోజూ తినే ఆహారాలపై శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మధుమేహం, శరీర బరువు పెరుగుతున్నవారు ఉలవ పప్పును ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాలి. వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.

ఉలవ పప్పు ప్రయోజనాలు:
మధుమేహంతో బాధపడుతున్నవారు ఉలవలను ప్రతి రోజూ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి శరీర బరువు, మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
 
మధుమేహం ఉన్న వారికి సహాయపడుతుందా?:
మధుమేహం ఉన్నవారు ఉలవ పప్పును ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ పప్పులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించి మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో దాదాపు 24 శాతం ప్రొటీన్ ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శరీర బరువు తగ్గాలనకునేవారు తప్పకుండా మీ డైట్‌లో ఉలవ పప్పును తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

కిడ్నీస్టోన్స్‌ నుంచి ఉపశమనం:
బ్లాక్‌గ్రామ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా కిడ్నీస్టోన్స్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్

Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News