Weight Loss Diet: గజిబిజి జీవన శైలి కారణంగా చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బిజీ లైఫ్ కారణంగా స్ట్రీట్ ఫుడ్ ను అధికంగా తింటున్నారు దీనివల్ల 32 సంవత్సరాలు వయసులో వారు కూడా గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలను సులభంగా ఉపశమనం పొందడానికి సోషల్ మీడియాలో లభించే చిట్కాలను ఆశ్రయిస్తున్నారు.
30 వయసు గల వారు కూడా 315 కిలోల శరీర బరువు పెరుగుతున్నారు. ఈ బరువు తగ్గడానికి శరీరంలో హార్మోన్ల సమతుల్యం తప్పనిసరి. అంతేకాకుండా బరువును తగ్గించుకోవడానికి చాలామంది కఠిన తరమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వ్యాయామాలు చేస్తూ డైట్లు పాటించడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.
అయితే ఇటీవలే ఇంటర్నెట్లో వైరల్ అయినా 136 కిలోలు బరువు గల క్రిస్టినా ఎన్నో రకాల డైట్లను పాటించింది. కానీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోయింది. వైద్య నిపుణులను సూచిస్తే బైపాస్ సర్జరీ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆమె బైపాస్ సర్జరీ కూడా చేయించుకుని నిపుణులు సూచించిన డైట్ ని క్రమం తప్పకుండా పాటించండి. దీంతో ఆమె సులభంగా బరువు తగ్గగలిగింది.
ఇలాంటి ఆహారాలు తినడం వల్లనే బరువు పెరిగింది:
క్రిస్టినా తన చిన్నతనంలో పదే పదే ఆకలితో ఉండేదని.. దీంతో ఆమె రోజుకు చాలాసార్లు ఫాస్ట్ ఫుడ్, ఇతర అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తీసుకునేదట. ఆమె ఇంటి ఆహారాలను పదేళ్ల వయస్సు దాకా తీసుకోవడంతో 136 కిలోలు బరువు పెరిగిందని ఆమె తెలిపింది.
ఇలా బరువు తగ్గింది:
గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ వల్ల క్రిస్టినా దాదాపు 90 కిలోల బరువు దాకా తగ్గింది. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన డైట్ ని ప్రతిరోజు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గానని ఆమె తెలిపింది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook