Weight Loss Plant Based Diet: ప్రస్తుతం చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల డైట్స్‌ను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ శరీర బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం అందరు వినియోగించే డైట్స్‌లో కిటో డైట్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇది శరీర బరువును తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుందని అందరికీ తెలిసిందే.. అయితే ఇటీవల అమెరికాకు చెందిన 63 ఏళ్ల బ్రెండా వర్క్‌మ్యాన్ ఆకు కూరలు తిని దాదాపు 27 కిలోల బరువు తగ్గారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల చాలా హెల్తీగా తయారైదని ఆమె తెలిపింది. అయితే ఆమె ఎలాంటి ఆహారాలు తీసుకోవడం బరువు తగ్గిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వర్క్‌మ్యాన్ డైలీ డైట్ ప్లాన్:
డైలీ డైట్ ప్లాన్ అనుసరించే క్రమంలో మాంసం, చీజ్, గుడ్లు, డైరీ వంటి ఉత్పత్తులను వినియోగించుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కూరగాయలను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఆమె బరువు తగ్గడానికి తరచుగా కూరగాలు, మొక్కల ఆధారిత ఆహారాలు మాత్రమే వినియోగించేదని పేర్కొంది. ఆమె పాటించిన డైట్‌లో బంగాళాదుంపలు, చిక్‌పీస్, బ్రౌన్ రైస్ విత్ బీన్స్ అతిగా తీసుకునేది. అంతేకాకుండా రాత్రి ఆహారంలో తప్పకుండా ఖర్జూరం, ఎండుద్రాక్ష, పండ్లు తీసుకోవాడం చాలా మంచిది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఇదే డైట్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
వర్క్‌మ్యాన్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్:
మొక్కల ఆధారిత ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్లే దాదాపు 27 కిలోల బరువు తగ్గారని ఆమె పేర్కొంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రించడానికి కూడా ప్రభావవంతంగా సహాయపడిందని నిపుణులు తెలిపారు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గించడానికి కూడా ఇది సహాయపడింది.
మొక్కల ఆధారిత ఆహారం ప్రయోజనాలు ఇవే:
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ చేసిన అధ్యయనం ప్రకారం..మొక్కల ఆధారిత ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభించి కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రింస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు, పక్షవాతం, స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు పేర్కోన్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి