Lok Sabhas Polls 2024: అవును దేశ వ్యాప్తంగా 18 లోక్ సభకు 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో 283 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మరో 4 విడతల్లో మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. ఈ నెల 13న దేశ వ్యాప్తంగా నాల్గో విడతలో భాగంగా 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. ఇందులో హైదరాబాద్ లోక్‌సభ స్థానం పై అందరి దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇదే స్థానంపై ఉంది. దీంతో పాటు రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్ నియోజకవర్గంతో పాటు.. రాయబరేలితో పాటు బీజేపీ తమిళనాడులోని కోయంబత్తూర్ స్థానాలపై అందరి దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే కోయంబత్తూర్ నుంచి మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఇక్కడ నుంచి బీజేపీ తమిలనాడు అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసారు. ఆయన గెలుపుపై బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అటు వాయినాడ్ నుంచి రెండో విడతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసారు. ఇక్కడ ఆయనకు ప్రత్యర్థులుగా సీపీఎం నుంచి అన్నీ రాజా తో పాటు బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ గట్టి పోటీ ఇచ్చారు. ఈ స్థానంపై కూడా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మరోవైపు రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న మరో స్థానం ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి. గత ఎన్నికల వరకు పోటీ చేసిన అమేఠి నుంచి కాకుండా.. తన తల్లి, నాయనమ్మ, తాతలు ప్రాతినిథ్యం వహించిన రాయబరేలి ఎంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అటు రాహుల్ రాయబరేలితో పాటు వాయనాడ్ నుంచి గెలిస్తే ఏ లోక్ సభ నియోజకవర్గాన్ని ఉంచుకుంటానేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ రెండు చోట్ల గెలిస్తే.. రాయబరేలికి రాజీనామా చేసి తన చెల్లెలు ప్రియాంక వాద్రాను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు 2014 వరకు తనకు కంచుకోటగా ఉన్న అమేఠీ బరిలో తన కుటుంబానికి సన్నిహితుడైన శర్మను బరిలో దించారు. అక్కడ బీజేపీ తరుపున స్మృతి ఇరానీ రెండోసారి ఈ స్థానం గెలవాలనే పట్టుదలతో అక్కడ పనిచేస్తోంది. ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
అటు ఈ మూడు లోక్ సభ సీట్లతో పాటు హైదరాబాద్ లోక్ సభ సీటుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొనేలా చేసింది మాధవి లత. తన ప్రచారంతో ఓవైసీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎన్నడు గుడి ముఖం చూడని ఓవైసీని గుళ్ల వైపు పరిగెత్తాలా చేసింది. అయితే బీజేపీ అధిష్ఠానం మాధవిలతను దించడం వెనక పెద్ద గ్రౌండ్ వర్క్ చేసింది. ఆమె అప్పటికే తన లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలతో ప్రజల్లో వెళ్లింది. మొత్తంగా ఓవైసీకి కోటకు బీటలు వారేలా చేస్తుందా లేదా అనేది చూడాలి. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా.. తక్కువ మార్జిన్‌తో టఫ్ ఫైట్‌తో బయటపడతారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5 లక్షల బోగస్ ఓట్లు తొలిగించారు. ఇలా తొలిగించిన ఓట్లలో అత్యధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో రాబోయే ఎన్నికల ఫలితాలను తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది. హైదరాబాద్ పరిధిలో దాదాపు 1.5 లక్షల 40 వేల దొంగ ఓట్లను తొలిగించడం అనేది ఓ రికార్డు అనే చెప్పాలి. తన పార్లమెంట్ పరిధిలో ఇన్ని లక్షల బోగస్ ఓట్లను తొలిగించినా ఓవైసీ కిక్కురుమనకుండా ఉండటం వెనక ఆయన ఓటమి భయాన్ని సూచిస్తోంది. మరోవైపు మాధవి లత ప్రచారానికి ఊహించిన రేంజ్లో పాతబస్తీ లాల్ దర్వాజా, సుధా టాకీస్ ప్రాంతాల్లో రెస్పాన్స్ రావడం ఆమె గెలుపుకు మంచి బూస్ట్ ఇస్తోంది. ఇక ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా,సుధా టాకీస్, రాజన్న బావి, హరిబౌలి, గౌలిపురా, ఛత్రినాక, దూద్ బౌలి, మలక్ పేట, మాదన్న పేట, ఉప్పుగూడ జియా గూడ, మంగళ్ హాట్ వంటి ప్రాంతాల్లో హిందు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ éరి ఈ ఓట్లని గంపగుత్తగా ఈమెకు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.
ముఖ్యంగా పాతబస్తీలో ఎక్కువ మంది చిరు ఉద్యోగులు మాధవి లత ప్రసంగాలు వినడానికి ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరి వస్తున్నాయి. ఇది వంద శాతం నిజం. మొత్తంగా ఓవైసీని భయపెట్టే సివంగి వచ్చిందని అందరు చెప్పుకుంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉత్తర ప్రదేశ్ తరహా పోల్ మేనేజ్మెంట్ జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఏది ఏమైనా దొంగ ఓట్లు తొలిగింపుతో పాటు 2 శాతం అటు వైపు ఓట్లు పడినా.. మాధవిలతా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సంచలనం సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter