ఇక నుంచి నో హెల్మెట్..నో పెట్రోల్ రూల్
ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్ ! హెల్మెట్ లేకుంటే పెట్రోల్ ఇవ్వరట. భయపడకండి..అది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఈ సరికొత్త నిబంధన తీసుకొచ్చారు. తాజా ఉత్తర్వులను అనసరించి జిల్లా పరిధిలోని 70కిపైగా పెట్రోల్ బంకుల్లో ఎక్కడికి వెళ్లినా ద్విచక్రవాహనదారుల వాహనాలకు పెట్రోల్ అందించే ప్రసక్తే లేదు.
పెట్రోల్ బంకుల్లో సీసీ టీవీలు
నో హెల్మెట్..నో పెట్రోల్ పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో సీసీటీవీలు అమర్చారు. బంకు యాజమాన్యం ఈ ఆదేశాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పదట. పక్క ప్రాంతాలనుంచి ఇక్కడికి ద్విచక్ర వాహనాల మీద వచ్చే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది.
ప్రమాదాల నివారణ కోసం..
ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలను ఇలాంటి కఠిన నింబంధనలు తప్పవంటున్నారు స్థానిక అధికారులు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఈ ఆంక్షలు విధించామని పేర్కొన్నారు. కాగా దీని ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ ...
నో హెల్మెట్..నో పెట్రోల్ నిబంధన తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది కదూ. రోడ్డు ప్రమాదాల రేటులో తెలుగు రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంటున్నాయి. మనకూ ఇలాంటి నిబంధన పెడితే కొంత వరకైనా రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించ వచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి
ఇక నుంచి నో హెల్మెట్..నో పెట్రోల్ రూల్