Earthquake in Jaipur: రాజస్థాన్ లో భూకంపం.. భయంతో పరుగులతో తీసిన జనం..

Rajasthan: రాజస్థాన్ లో స్వల్ప భూకంపం వచ్చింది. రాజధాని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2023, 08:17 AM IST
Earthquake in Jaipur: రాజస్థాన్ లో భూకంపం.. భయంతో పరుగులతో తీసిన జనం..

Earthquake in Jaipur: రాజస్థాన్ లో స్వల్ప భూకంపం (Earthquake in Rajasthan) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున రాజధాని జైపూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. జైపూర్‌లో ఉదయం 4:09 నుండి 4:25 మధ్యలో వేర్వేరు సమయాల్లో మూడు సార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చారు. గాఢనిద్రలో ఉండగా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆరావళి కొండల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. జైపూర్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. 

రాజధానిలో మొదటి ప్రకంపన 04:09:38కి రాగా... రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. రెండోది  04:22:57కి రాగా..  రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది. మూడవ జోల్ట్ 04:25:33కి రాగా..  రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. గత మార్చి 21 మరియు జనవరి 24 తేదీల్లో జైపూర్ మరియు రాజస్థాన్‌లోని ఇతర జిల్లాలలో భూకంపం ప్రకంపనలు సంభవించాయి.  ఇటీవల సికార్‌ జిల్లాను భూకంపం వణికించింది.

Also Read: Manipur video: స్పందికపోతే మేం చర్యలు తీసుకుంటాం.. మణిపూర్ ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్

ఈ భూకంపంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజధాని జైపూర్ తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. '' గంట వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. నా కుటుంబం మెుత్తం నిద్రలోంచి ఉలిక్కిపడ్డాం. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు'' అని స్థానికుడు ఒకరు తెలిపారు.  

Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News