7th Pay Commission Latest Update: ఈ ఏడాది డీఏ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 62 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, 48 లక్షల మంది పెన్షనర్లు డీఆర్ ప్రకటించనుంది కేంద్రం. హోలీకి ముందు మార్చి మొదటి వారంలో జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈసారి డీఏ 4 శాతం పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 38 శాతం డీఏ లభిస్తుండగా.. అది 42 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు మార్చి నెల జీతంలో కలిపి పెరిగిన డీఏను జమ చేయనున్నారు.
డీఏ ప్రకటన మార్చిలో వచ్చినా.. జనవరి నెల నుంచి వర్తిస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు కూడా మార్చి నెల జీతంతో కలిపి చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కరువు భత్యం సంవత్సరానికి రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. జనవరి, జూలై నుంచి వర్తిస్తాయి. డిసెంబరులో ఏఐసీపీఐ సూచీ 132.3 పాయింట్లకు చేరుకుంది. ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచితే.. రూ.18 వేల బేసిక్ జీతంపై రూ.7560 డియర్నెస్ అలవెన్స్ లభిస్తుంది.
ప్రస్తుతం 38 శాతం ప్రకారం.. ఈ డియర్నెస్ అలవెన్స్ 6840 రూపాయలు అందుతోంది. ఏడాదికి దాదాపు రూ.9 వేల వరకు చెల్లిస్తోంది. గరిష్ట మూల వేతనం రూ.56,900పై డీఏ పెంపు గణాంకాలను పరిశీలిస్తే.. అది నెలకు రూ.2276 (ఏడాదికి రూ.27,312) అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగులకు నెలకు రూ.21,622 డీఏ లభిస్తుండగా.. అది రూ.23,898కి పెరగనుంది.
మార్చి నెల జీతంలో డీఎ పెంపు డబ్బును కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు. రెండు నెలల బకాయిలు కూడా కలిపితే.. ఒకేసారి భారీగా నగదు జమకానుంది. అంతేకాకుండా హోలీ తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలనే డిమాండ్‌ను కూడా కేంద్రం నెరవేరుస్తుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
Also Read: Nara Lokesh Breaks Down: తారకరత్న మరణ వార్త విని కన్నీటిపర్యంతమైన లోకేష్.. వాళ్ల వల్ల కుడా కాలేదట!
Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook