CM Basavaraj Bommai On 7th Pay Commission: డియర్నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. హోలీకి ముందే ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశం ఉంది. పెంచిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి అమలు కానుంది. డీఏ పెంపుతోపాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పులు, పెండింగ్ డీఏపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఏడో వేతన సంఘం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అయితే జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలు అవుతుందని ఉద్యోగులు భావించగా.. ఏప్రిట్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో సీఎం ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేస్తోంది.
ఉద్యోగుల వేతన మార్పు నివేదికను మాజీ సీఎస్ సుధాకర్‌రావు నేతృత్వంలోని కమిటీ అందజేస్తుందని సీఎం బొమ్మై తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. అదనపు మొత్తాన్ని అనుబంధ బడ్జెట్లో అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఏడో వేతన సంఘం నివేదికను కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తామని ప్రకటించారు.
శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం బొమ్మై.. రైతుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు ఇచ్చే వడ్డీలేని లోన్ లిమిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు.'భూ శ్రీ' పథకం కింద 'కిసాన్ క్రెడిట్ కార్డ్' హోల్డర్లకు 2023-24 సంవత్సరంలో రూ.10 వేల అదనపు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అదేవిధంగా 'శ్రమ శక్తి' పథకాన్ని కూడా ప్రకటించారు. ఈ పథకం కింద భూమిలేని మహిళా వ్యవసాయ కూలీలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.500 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం చెప్పిన ఎమ్మెల్సీ కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook