Actress Gautami shocking comments on dmk stalin govt: తమిళ నాడు ఇటీవల తరచుగా వార్తలలో ఉంటుంది. ఒక వైపు సీఎం స్టాలీన్ వర్సెస్ గవర్నర్ ఆర్ ఎన్ రవిల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం స్టాలీన్ జాతీయ గీతంను గౌరవించలేదని .. గవర్నర్ మధ్యలో నుంచి వెళ్లి పోయారు. దీంతో ఇద్దరుకూడా దీనిపై ట్విటర్ లో ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. మళ్లీ తమిళనాడులోస్టాలీన్ సర్కారుపై.. అన్నాడీఎంకే విధాన ప్రచార ఉపకార్యదర్శి గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎంజీఆర్ 108వ జయంతి సందర్భంగా చెన్నై ఉత్తర తూర్పు జిల్లా తరపున నిన్న సమావేశం, సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా.. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని ప్రముఖ నటి, అన్నాడీఎంకే విధాన ప్రచార ఉపకార్యదర్శి గౌతమి మండిపడ్డారు.
మరోవైపు నటుడు సత్యరాజ్ (కట్టప్ప) కుమార్తె డీఎంకేలో చేరిన విషయంలో తెలిసిందే. దీనిపై గౌతమి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు. ఆమె పార్టీలో చేరడంను ప్రస్తావిస్తూ.. ఎవరు ఏ పార్టీలోనైనా చేరొచ్చని, అయితే వారు ప్రజలకు ఏం చేస్తున్నారన్నదే ముఖ్యమని అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు డెవ్ లప్ మెంట్ లో పూర్తిగా వెనక్కు వెళ్లిపోయిందన్నారు.
Read more: Shah Rukh Khan: చిరుత నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
అన్నాడీఎంకే అమలు చేసిన సంక్షేమ పథకాలను, డీఎంకే అమలు చేయలేదన్నారు. జయలలిత తన హయాంలో తాళికి తంగం, ఉచిత ల్యాప్‌టాప్, ద్విచక్ర వాహనాలకు రాయితీ తదితర పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో గౌతమి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి