Assam: ఉద్యోగ, ప్రవేశ పరీక్షలకు కట్టుదిట్టమైన నిబంధనలు విధించి...విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు అధికారులు. చివరికి పెళ్లయిన స్త్రీలు(woman) తాళీని కూడా తీయనిదే పరీక్ష హలులోకి అనుమతి ఇవ్వని నిబంధనలు తీసుకువచ్చారు. మహిళలు, బాలికలకు అయితే తలలో పిన్ను, బొట్టు మొదలుకుని కాలి మెట్టెల వరకు.. అబ్బాయిలకైతే బెల్ట్, షూస్, ఫుల్ షర్ట్స్ వేసుకోరాదు వంటి వాటితోపాటు చివరకు జీన్స్ ప్యాంట్‌లకు ఉండే బటన్‌లు కూడా ఉండొద్దనే నిర్ణయాలు పరీక్షల(Exams)కు వచ్చేవారికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి చేదు అనుభవమే ఓ విద్యార్థిని ఎదురైంది.
వివరాల్లోకి వెళితే..
అసోం(Assam)లో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు(Agricultural University Entrance Tests) మొదలయ్యాయి. సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్(Tezpur)లో ఉన్న గిరిజానంద చౌదరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (జీసీఐఎంటీ)లో పరీక్ష రాసేందుకు విద్యార్థిని జూబ్లీ తములి (19) వచ్చింది. తనిఖీలు చేసిన అనంతరం ఆమెను లోపలికి అనుమతిచ్చారు. అయితే పరీక్ష హాల్‌లోకి వెళ్తుండగా పర్యవేక్షకులు తములిని ఆపివేశారు. పరీక్షకు అందరినీ పంపించినా తనను ఆపడంపై తములి ప్రశ్నించింది. నువ్వు షార్ట్ (Short) వేసుకురావడంతో పరీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Also Read: Shocking News: వీడు చదివేదే 6వ తరగతి.. కానీ బ్యాంకు అకౌంట్లో రూ. 900 కోట్లు!
కర్టెన్ కప్పుకుని పరీక్ష రాసింది..
దీంతో ఆ అమ్మాయి షాక్‌కు గురయ్యింది. డ్రస్ కోడ్(Dress Code) గురించి ఎక్కడా పేర్కొనలేదని తములి తెలిపింది. అడ్మిట్, ఆధార్ కార్డు తదితర అన్నీ ఉన్నా కేవలం వస్త్రధారణ సరిగ్గా లేదని అనుమతించకపోవడంపై విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. కంగారుపడుతూ తండ్రి ఒక డ్రెస్ తీసుకువచ్చేందుకు మార్కెట్‌కు పరుగెత్తాడు. పరీక్షకు ఆలస్యమవుతుండడంతో ఇదంతా గమనిస్తున్న తోటి విద్యార్థినులు కళాశాలలోని ఓ కర్టెన్ తీసుకొచ్చారు.
షార్ట్స్ వేసుకోవడం నేరమా?
హాల్‌లోకి వెళ్లిన విద్యార్థిని కర్టెన్ కప్పుకునే పరీక్ష రాసింది. బయటకు వచ్చిన అనంతరం తములి కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి ఘోర అవమాన ఘటన నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొలేదు’ అని ఆవేదన చెందింది. ‘షార్ట్స్ వేసుకోవడం ఏమైనా నేరమా?’ అని నిలదీసింది. ‘కళాశాల ఒకవేళ పొట్టి దుస్తులు అనుమతించిందని అనుకుంటే ముందే హాల్ టికెట్లలో పేర్కొనాలి’ అని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook