Bharat Bandh Today Latest Updates: నేడు భారత్ బంద్, వ్యాపార సంఘాల కీలక డిమాండ్లు ఇవే, Farmers మద్దతు

Bharat Bandh Today On 26 February 2021: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ భారత్ బంద్‌నకు పిలుపు ఇవ్వడంతో 8కోట్ల మంది వర్తకులు ఇందులో పాల్గొననున్నారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలతో విసిగిపోయిన రైతన్నలు సైతం వ్యాపార సంఘాల భారత్‌ బంద్‌నకు మద్దతు ప్రకటించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 26, 2021, 10:16 AM IST
Bharat Bandh Today Latest Updates: నేడు భారత్ బంద్, వ్యాపార సంఘాల కీలక డిమాండ్లు ఇవే, Farmers మద్దతు

Bharat Bandh Today Latest Updates: వ్యాపార సంఘాలు కదం తొక్కాయి. వస్తుసేవల పన్ను(GST) నియమ నిబంధనలలో మార్పులు, అనునిత్యం పెరుగుతున్న ఇంధన ధరలు, ఈ-వే బిల్లింగ్‌లకు నిరసనగా దేశ వ్యాప్తంగా 40 వేలకు పైగా వ్యాపార సంఘాలు భారత్ బంద్‌నకు పిలుపునిచ్చాయి. 

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ భారత్ బంద్‌నకు పిలుపు ఇవ్వడంతో 8కోట్ల మంది వర్తకులు ఇందులో పాల్గొననున్నారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలతో విసిగిపోయిన రైతన్నలు సైతం వ్యాపార సంఘాల భారత్‌ బంద్‌నకు మద్దతు ప్రకటించారు. ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సైతం సంపూర్ణ మద్దతు తెలిపింది. దేశ వ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 26న) 1500కు పైగా ప్రాంతాల్లో తమ డిమాండ్ల అమలుకుగానూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇంధన ధరలు(Petrol Diesel Price Today), జీఎస్టీ నిబంధనలలో మార్పులు, ఈ-వే బిల్లింగ్‌లకు నిరసనగా బంద్ కొనసాగనుంది.

Also Read: 7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం

వస్తుసేవల సన్ను (GST)తో అన్ని పన్నులు సరళతరం అవుతాయని చెప్పి, అనంతరం భారీగా పన్నులు వసూళ్లు చేస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ మండిపడింది. ట్యాక్స్ స్లాబ్‌లను హేతుబద్దీకరించాలని కోరినా ప్రయోజనం లేకపోవడంతో భారత్ బంద్‌నకు పిలుపు ఇచ్చినట్లు దాని ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేవాల్ తెలిపారు. నేడు దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపార మార్కెట్లు భారత్ బంద్‌నకు మద్దతుగా మూసివేయనున్నట్లు చెప్పారు. జీఎస్టీ విధానం ద్వారా పరోక్షంగా ప్రజలపై అధిక పన్నులు విధిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, మిశ్రమంగా Silver Price

దేశ వ్యాప్తంగా 40 వేల వ్యాపార సంఘాలు సైతం E-Way Billను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతిరోజూ ఇంధన ధరలు పెంచుతున్నారని, ఇది మంది నిర్ణయం కాదని వ్యాపారం సంఘాలు మండిపడుతున్నాయి. సీఏఐటీ ఇచ్చిన బంద్‌ పిలుపునకు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది. ఇంధన ధరలు తగ్గించకపోతే తాము సైతం సమ్మెలు, బంద్‌లకు దిగనున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా పలు రైతుల సంఘాల నేతలు వ్యాపార సంఘాల భారత్ బంద్‌కు మద్దతు తెలపడంతో పాటు సంఘీభావం ప్రకటించాయి.

Also Read: LPG Price Hike: ఫిబ్రవరి నెలలో మూడోసారి పెరిగిన ఎల్పీజీ ధర, లేటెస్ట్ రేట్లు ఇవే

మద్దతివ్వని రెండు యూనియన్లు
నేడు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్‌కు రెండు కీలక వ్యాపార సంఘాలు మద్దతు తెలపలేదు. తాము ఈ బంద్‌లో పాల్గొనడం లేదని అఖిల భారత వ్యాపార మండల్, భారతీయ ఉద్యోగ వ్యాపార మండలి పేర్కొన్నాయి. జీఎస్టీ సంబంధిత సమస్యపై కేంద్ర ప్రభుద్వానికి తాము మెమోరాండం సమర్పించామని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని భారతీయ ఉద్యోగ వ్యాపార మండలి ఢిల్లీ ప్రధాన కార్యదర్శి రాకేష్ యాదవ్ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News