కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకొచ్చే పనిలో ఫార్మా సంస్థలు బిజీగా ఉన్నాయి. భారత్ బయోటెక్ (Bharat Biotech) ఇంటర్నేషనల్ కోవాగ్జిన్ ( Covaxin) పేరుతో కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవాగ్జిన్ మూడో దశ క్లినికిల్ ట్రయల్స్ నవంబర్ నెలలో చేయనున్నట్లు సమాచారం. నవంబర్ తొలి వారం లేక రెండో వారంలో కోవాగ్జిన్ మూదో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభించనున్నట్లు నిమ్స్ వైద్య వర్గాల సమాచారం. ఈ క్రమంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం (అక్టోబర్ 6న) ప్రారంభించారు.
Also Read : Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా మంగళవారం 12 మందికి కరోనా టీకా ఇచ్చి బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ వివరాలను క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మరో మూడు రోజుల వ్యవధిలో మరో 55 మందికి కోవాగ్జిన్ టీకా వేసి పరీక్షలు కొనసాగించనున్నారు. రెండు వారాల అనంతరం వీరి రక్త నమూనాలు సేకరించి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు పంపిస్తారు.
తొలి దశ టీకా సత్ఫలితాలు ఇచ్చిందని, మరికొన్ని రోజుల్లో రెండో దశలో కోవాగ్జిన్ పనితీరు తెలుస్తుందన్నారు. కోవాగ్జిన్ మూడో దశలో భారీ సంఖ్యలో వాలంటీర్లకు కోవిడ్19 వ్యాక్సిన్ ఇచ్చి పరీక్షించనున్నట్లు ప్రభాకర్ రెడ్డి వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe