Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హాజరైన ఓ సభకు సమీపంలో బాంబు దాడి జరిగింది. నలందలోని సిలావ్ వద్ద నిర్వహించిన జనసభ స్థలానికి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. సీఎం ఎదుటే బాంబు పెలినట్లు వెల్లడైంది. అయితే అది బాణా సంచా కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ దాడికి సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Bihar | A bomb was hurled near Bihar Chief Minister Nitish Kumar's 'Jansabha' site in Nalanda. More details awaited.
— ANI (@ANI) April 12, 2022
ఇటీవలే ఓ వ్యక్తి.. సీఎం నితిశ్ కుమార్‌కి బాగా పట్టున్న పట్నాలోని భక్తియార్‌పూర్‌లో చీఫ్ మినిష్టర్ సెక్యూరిటీని దాటుకుని నితీశ్ కుమార్‌పై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటన మరవక ముందే తాజాగా చోటుచేసుకున్న జనసభ బాంబు దాడి ఘటన బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కి ముప్పు పొంచి ఉందనే వార్తలకు మరోసారి బలం చేకూర్చినట్టయింది.
Also read: Gang Rape: బర్త్ డే పార్టీలో దారుణం... 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి
Also read: CPM Politburo: 58 ఏళ్ల తర్వాత.. ఎట్టకేలకు సీపీఎం పొలిట్ బ్యూరోలో తొలిసారి దళిత నేతకు స్థానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook