Cbse 12Th Result 2024 Link Check Online In Telugu: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. సీబీఎస్ సోమవారం 10వ, 12వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు పరీక్ష ఫలితాలు https://www.cbse.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు విడుదల ఫలితాల్లో 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే 12వ తరగతి స్కోర్‌లు ఇప్పటికే డిజిలాకర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫలితాలను చూసుకోవడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ ఐడీ నంబర్‌తో పాటు అడ్మిట్ ID కార్డ్‌ను వినియోగించి ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన 12వ తరగతి పరీక్ష నోటిఫికేషన్‌లో 1633730 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 1621224 మంది స్టూడెట్స్ ఫరీక్షలకు హాజరయ్యారు. ఇక ఇందులో 1426420 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని CBSE వెల్లడించింది. ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 87.98 ఉందని బోర్డ్ తెలిపింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త పెరిగినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఏడాది 91.52 శాతంకు పైగా అమ్మాయి అభ్యర్థుల ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలుర విషయానికొస్తే 85.12 శాతంకు పైగా ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్ వెల్లడించింది. ఇక ప్రాంతాల వారిగా చూస్తే, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లోని విద్యార్థులు 94.51 శాతం ఉత్తీర్ణత సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక పశ్చిమ ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు 95.64 శాతం ఉత్తీర్ణత సాధించిన్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు ఫరీక్షల ఫలితాలను చూసుకోని విద్యార్థులు ఇలా నేరుగా cbseresults.nic.inలో చూసుకోవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇలా చెక్ చేసుకోండి.
అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా:
సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లకు వెళ్లండి: https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/
మీ రోల్ నంబర్, అడ్మిట్ కార్డ్ నంబర్, పాఠశాల నంబర్‌ను ఆ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత "సబ్మిట్" బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఈ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు.
Digilocker ద్వారా:
ఇప్పటికే ప్రభుత్వ సేవల ఖాతా ఉంటే, Digilocker ద్వారా మీ ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.
https://www.digilocker.gov.in/కి వెళ్లి, మీ ఖాతాతో లాగిన్ అవ్వండి.
"విద్య" విభాగానికి వెళ్లి, "CBSE 12వ తరగతి ఫలితాలు" ఎంచుకోండి.
అంతే సులభంగా మీకు స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
ఈ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేసుకోవచ్చు.
SMS ద్వారా:
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 09223344222కు SMS పంపండి.
SMSలో cbse12 <roll no> <school code> ఫార్మాట్‌లో ఉండాల్సి ఉంటుంది.
అంతే మీకు సులభంగా ఫలితాలు వస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి