Covid19: కోవిడ్ 19 చికిత్సలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో పెట్టుకుని..చిన్నారులకు చేయాల్సిన వైద్య విధానంపై స్పష్టత ఇచ్చింది. కరోనా చికిత్సలో పెద్దలకు, చిన్నారులకు తేడా ఉంటుందని గుర్తు చేసింది.
కోవిడ్ 19 చికిత్సలో (Covid19 Treatment) భాగంగా ముఖ్యంగా పెద్దవారికి వివిధ రకాల ఔషధాలు ఉపయోగిస్తున్నారు. కచ్చితమైన మందు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా అన్ని రకాల మందుల్ని ప్రయోగిస్తున్నారు. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో చిన్నారుల కోవిడ్ కేర్ సేవల విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ( Union Health Ministry) కొత్తగా కొన్ని మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఐవర్ మెక్టీన్, హైడ్రాక్సీక్లోరోక్వీన్, ఫావిపిరవిర్, డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి మందుల్ని సాధారణంగా కోవిడ్ చికిత్సలో భాగంగా పెద్దలకు ఇస్తుంటాము. అయితే వీటిని చిన్నారులకు ఇవ్వవద్దని ప్రతిపాదించింది. వైరస్ సోకిన పిల్లలకు చికిత్స అందించడంలో అలసత్వం మంచిది కాదని సూచించింది. మౌళిక సదుపాయాల్ని ఇప్పట్నించే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాల్ని కోరింది. ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా సులభంగా సోకే ప్రమాదముందని..కరోనా వ్యాక్సినేషన్(Vaccination) అనుమతి వచ్చిన తరువాత ముందుగా వారికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. కరోనా చికిత్సలో పెద్దలకు ఉద్దేశించిన మందుల్ని పిల్లలకు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. సుశిక్షితులైన వైద్యులు, నర్శుల్ని నియమించుకోవాలని పేర్కొంది. పిల్లల ఆసుపత్రుల్లో కరోనా బాధిత చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుండాలని...పిల్లలకు చికిత్స అందించేటప్పుడు తల్లిదండ్రుల్ని అనుమతించవచ్చని సూచించింది. పిల్లలకు కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదని..అలాంటివారు తల్లిదండ్రుల సంరక్షణలో కోలుకుంటున్నారని గుర్తు చేసింది. లక్షణాలుంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ అవసరమని..ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు భావిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook