E-Rupi: కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొత్త స్కీమ్..రేపట్నించి అందుబాటులో రానుంది.
డిజిటల్ లావాదేవీల (Digital transactions)కోసం ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు, అమెజాన్ పే, పేటీఎం ఇలా చాలానే ఉన్నాయి. ఇవేమీ కాకుండా నగదు రహిత లావాదేవీల కోసం కేంద్ర ప్రభుత్వం(Central government) కొత్త విధానాన్ని అందుబాటులో తీసుకురానుంది. ఈ విధానం నగదు రహిత లావాదేవీల్ని మరింత తేలిక చేస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. ఈ విధానం పేరు ఈ రూపి. ఈ రూపి విధానంలో నగదు చెల్లింపులను క్యూ ఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ ద్వారా లబ్దిదారుడి మొబైల్ పోన్‌కు పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్దిదారుడు తనకు అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల్ని మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ రూపి(E Rupi) విధానం అమల్లో రానుంది.
ప్రస్తుతానికి అంటే రేపట్నించి అందుబాటులో రానున్న ఈ కొత్త విధానం తొలిదశలో కేంద్రం నుంచి ఆర్ధిక సాయం పొందే లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సహాయం అందుతుంది. మొబైల్ ఫోన్‌కు క్యూఆర్ కోడ్, ఎస్ఎంఎస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది కానీ ఎలా వినియోగించాలనే విషయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకేనా లేదా అందరికీ ఈ విధానం అందుబాటులో ఉంటుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
Also read: ఇండియాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా ఉధృతి, పెరుగుతున్న కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook