Fake News on Central Govt Schemes: దేశంలో ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. మహిళలు, ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేక పథకాలను తీసుకువచ్చింది. ఆర్థిక సాయం, ఉపాధి నిమిత్తం అవసరమైన వస్తువులను అందిస్తోంది. అయితే పథకాల మాటున ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్ఫేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది.
దేశంలోని మహిళలకు సాధికారత కల్పించేందుకు.. స్వయం ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి ఉచిత కుట్టు యంత్రం పథకం 2023" కింద మహిళలకు ఉచితంగా కుట్టు యంత్రాలను అందజేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం ఇలాంటి పథకాలను నమ్మొద్దని కోరింది. అసలు అటువంటి పథకం అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇది మోసం చేసే ప్రయత్నమని.. దయచేసి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇటీవల నిజమైన సమాచారం కంటే.. ఫేక్ వార్తలకే డిమాండ్ ఎక్కువైంది. నిజం గడప దాటేలోపు.. అబద్దం ఊరంతా తిరిగివచ్చినట్లు ఫేక్ న్యూస్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి తప్పుడు వార్తలను, పోస్టులను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకం గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే.. అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది. అలాంటి వార్తలను ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. మీరు ఏదైనా వైరల్ మెసేజ్ ఫ్యాక్ట్ చెక్ చేయాలంటే.. మొబైల్ నంబర్ 918799711259 లేదా socialmedia@pib.gov.in కు మెయిల్ చేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook