China: గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ఇండియాకు చైనా రక్షణ మంత్రి

SCO Summit 2023: చైనా రక్షణశాఖ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో జరగనున్న ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2023, 05:11 PM IST
China: గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ఇండియాకు చైనా రక్షణ మంత్రి

SCO Defence Ministers meet 2023: వచ్చే వారం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ మంత్రుల సమావేశం భారత్‌లో జరగనుంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి చైనా రక్షణ మంత్రి  లీషాంగ్‌ఫూ హాజరుకానున్నారు. 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణల తరువాత చైనా రక్షణ మంత్రి భారతదేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, ఆఫ్గానిస్థాన్‌లోని భద్రతా పరిస్థితి వంటి అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ మీటింగ్ కు చైనా ఢిఫెన్స్ మినిస్టర్ తోపాటు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయగులు కూడా పర్యటించనున్నారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ను కూడా ఆహ్వానించారు. 

ఓవైపు ఇండియా, డ్రాగన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో.. చైనా రక్షణ మంత్రి భారత్‌ను సందర్శించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకోనుంది. లాస్ట్ ఇయర్ కూడా తవాంగ్‌ సెక్టార్‌లో యాంగత్సే వద్ద భారత్‌-చైనా దళాలు గొడవ పడ్డ సంగతి తెలిసిందే. మరోవైపు రష్యా రక్షణ మంత్రి షోయిగు ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక తొలిసారి ఇండియాకు రానున్నారు. వచ్చే నెల 05న గోవాలో ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశం జరగనుంది. దీనికి పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే దాయాది దేశం ధృవీకరించింది.

Also Read: Sudan Violence News: సుడాన్‌లో హింసాత్మక పరిస్థితులు.. భారతీయుల సేఫ్టీపై స్పందించిన భారత్

Also Read: Ukrainian: ఉక్రెయిన్ గగన తలంపై ఫ్లాష్‌ లైట్‌ రష్యా పని అనుకుని ఆందోళన.. చివరకు అంతా రిలాక్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News