Covid Third Wave in India: జనవరిలోనే కరోనా థర్డ్ వేవ్.. ఫిబ్రవరిలో పీక్ స్టేజ్! రోజుకు లక్షకు పైగా కేసులు!!

కరోనా థర్డ్‌ వేవ్‌ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకు 1-1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 11:55 AM IST
  • జనవరిలోనే కరోనా థర్డ్ వేవ్
  • ఫిబ్రవరిలో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్
  • రోజుకు లక్షకు పైగా కేసులు
Covid Third Wave in India: జనవరిలోనే కరోనా థర్డ్ వేవ్.. ఫిబ్రవరిలో పీక్ స్టేజ్! రోజుకు లక్షకు పైగా కేసులు!!

Coronavirus 3rd wave likely to hit January, February in India: ప్రపంచాన్ని కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి పీడ అసలు వదిలేలా లేదు. ప్రమాదకర డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. 'ఒమిక్రాన్‌' (Omicron) రూపంలో మరో భయంకర కొత్త వేరియంట్‌ వచ్చింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌.. రోజులు గడుస్తున్నా కొద్ది ప్రపంచదేశాలకు పాకుతోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్‌ పంజా విసురుతుండగా.. భారత్‌లోకి కూడా ప్రవేశించింది.  తాజాగా మహరాష్ట్రలో రెండు, రాజస్థాన్‌లో ఒక కేసు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. థర్డ్‌ వేవ్‌ (Third Wave) కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కరోనా థర్డ్‌ వేవ్‌ (Third Wave) భారత దేశంలో (India) ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ (IIT scientist Manindra Agarwal) అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకు 1-1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఓ జాతీయ మీడియాతో మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ... 'కొత్త వేరియంట్‌తో ఫిబ్రవరి నాటికి దేశంలో థర్డ్‌ వేవ్‌ పీక్ స్టేజ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. జనవరి నుంచే థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచివుంది. అయితే సెకండ్ వేవ్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది. ఓమిక్రాన్ యొక్క తీవ్రత డెల్టా వేరియంట్‌లో కనిపించే దానిలా లేదు. దక్షిణాఫ్రికాలో నమోదైన కేసులపై నిశితంగా పరిశీలిస్తున్నాం' అని తెలిపారు. 

Also Read: Viral Video: సిక్స్‌ప్యాక్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్న 'పిల్లి'...ఫిదా అవుతున్న నెటిజన్స్

'ప్రస్తుతం దక్షిణాఫ్రికా కొత్త కేసులు ఎక్కువగా నమోదవడం లేదు. ఇది కాస్త సంతోషించాల్సిన విషయం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ అధిక ట్రాన్స్‌మిసిబిలిటీని చూపించినప్పటికీ.. దాని తీవ్రత డెల్టా వేరియంట్‌ కంటే తక్కువగానే ఉండనుంది. దేశంలో లాక్‌డౌన్‌ అవసరం లేదు. తేలికపాటి లాక్‌డౌన్ (రాత్రి కర్ఫ్యూ) సరిపోతుంది. జనసమూహాల నియంత్రణ ఆంక్షల ద్వారా దీని తీవ్రతను అదుపు చేయవచ్చు' అని మనీంద్ర అగర్వాల్ సూచించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. మాస్కులు ధరించడం, సామజిక దూరం పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Also Read: Virat Kohli: బర్త్ డే విషెష్ చెప్పిన విరాట్ కోహ్లీ.. ఆనందంలో మునిగితేలిన అభిమాని (వీడియో)

దేశంలో కరోనా వైరస్ (Coronavirus ) మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్ర పరంగా అంచనా వేశారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం (Central Govt) వినియోగిస్తోన్న 'సూత్ర మోడల్‌'ను వినియోగించారు. అయితే ఆ సమయంలోనే పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ముందస్తు చర్యలపైనే కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి, ప్రభావం ఆధారపడి ఉంటుందన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News