Covaxin Efficacy: మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ సామర్ధ్యం మరోసారి రుజువైంది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని..కొత్త రకం వైరస్‌లను విజయవంతంగా ఎదుర్కొంటోందని తేలింది.
ఇండియాలో ప్రస్తుతం సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum institute), భారత్ బయోటెక్( Bharat Biotech) కంపెనీల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ పూర్తిగా స్వదేశీ తయారీ. ఈ వ్యాక్సిన్ సామర్ధ్యంపై ఇప్పుడు ఐసీఎంఆర్(ICMR) ప్రశంసలు కురిపిస్తోంది. భారత్ బయోటెక్ అబివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ సామర్ధ్యంపై ఐసీఎంఆర్ కితాబిచ్చింది. కరోనా కొత్తరకం వైరస్‌పై కోవ్యాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్(Covaxin vaccine)..యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వైరస్‌లను బంధించి కల్చర్ చేయగలిగినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతోపాటు ఇటీవలే భారత్‌లో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్ నిలువరిస్తోందని వెల్లడించింది. కోవిడ్ టీకా(Covid vaccine) తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్ బయోటెక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు.
అయితే వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్క్ ధారణ తప్పనిసరి అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కోవిడ్ వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందడంపై డాక్టర్ కృష్ణ స్పందించారు. వ్యాక్సిన్ అనేది కేవలం ఊపిరితిత్తుల కింది భాగాన్ని రక్షిస్తుందని..పై భాగాన్ని కాదని చెప్పారు. అందుకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చే అవకాశముందన్నారు. కోవ్యాగ్జిన్ ( Covaxin) ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచనున్నామని భారత్ బయోటెక్ కంపెనీ వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఏటా 70 కోట్ల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరులోని ప్లాంట్లను దశలవారీగా విస్తరించనున్నట్టు వివరించింది.
Also read: Flights Cancel: యూకే ఆంక్షలు, వారం రోజులపాటు Air India సర్వీసులు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook