Ahmed patel: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంటిపై ఈడీ దాడులు

ED raids Ahmed patel residence: కాంగ్రెస్‌లో నెంబర్ టూ హోదాలో ఉన్న పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ( Ahmed patel ) ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ( Enforcement directorate ) సోదాలు జరుపుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో గతంలోనే ఆయన్ని విచారించేందుకు ప్రయత్నించినా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అప్పుడాయన ఈడి దాడుల నుంచి తప్పించుకున్నారు.

Last Updated : Jun 27, 2020, 10:05 PM IST
Ahmed patel: కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఇంటిపై ఈడీ దాడులు

ED raids Ahmed patel residence: కాంగ్రెస్‌లో నెంబర్ టూ హోదాలో ఉన్న పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ( Ahmed patel ) ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ( Enforcement directorate ) సోదాలు జరుపుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో గతంలోనే ఆయన్ని విచారించేందుకు ప్రయత్నించినా.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అప్పుడాయన ఈడి దాడుల నుంచి తప్పించుకున్నారు. 

అహ్మెద్ పటేల్ గురించి చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ కోశాధికారి, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే అహ్మెద్ పటేల్ ప్రత్యేకతల జాబితా పెద్దదే. పార్టీలో నెంబర్ టూ కేడర్‌లో ఉంటూ చక్రం తిప్పుతుండే అహ్మద్ పటేల్ ఇక ఈడీ నుంచి తప్పించుకోలేకపోయారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికార్లు చేరుకున్నారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ( Stelrling biotech limited ) సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ( Money laundering case ) ఈయన్ని విచారించేందుకు ఈడీ ఆయన ఇంటికి చేరుకుంది. వాస్తవానికి గతంలోనే ఆహ్మద్ పటేల్‌ను విచారించాల్సి ఉన్నా… కోవిడ్ 19 నిబంధనల మేరకు అప్పట్లో అది సాధ్యపడలేదు. 

స్టెర్లింగ్ బయోటెక్ కేసులో 5 వేల కోట్ల మేర కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కంపెనీ ప్రమోటర్లైన నితిన్, చేతన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నైజీరియాలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి వీరిని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు ఏజెన్సీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.

Trending News