Maha kumbh mela Utsav: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. సెక్టార్ 5 లోని శిబిరంలో మంటలు చెలరేగాయి. ఒక భక్తుడు తెచ్చుకున్న సిలిండర్ పేలడంతో శిబిరంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో మంటలు శరవేగంగా ఇతర గుడారాలకు వ్యాపించాయి.
దాదాపు.. ఈ మంటలలో.. 30 గుడారాల వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తొంది. వెంటనే ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రదేశంలో ఆకాశంలో నల్లని పొగలు వ్యాపించాయి. దట్టంగా మంటలు పైకి ఎగిసి పడ్డాయి. ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం
యూపీ - ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు
ఈ ప్రమాదంలో దగ్ధమైన 30 టెంట్లు.. భయంతో పరుగులు తీసిన భక్తులు
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది pic.twitter.com/tTA2TjkoP6
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025
కుంభమేళకు ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహా కుంభమేళ కావడంతో భక్తులు భారీగా కుంభమేళకు తరలి వస్తున్నారు. మనదేశం నుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు.
సాధులు, అఘోరీలు, నాగ సాధులు.. తరలి వస్తున్నారు. నాగ సాధు మాతలు కూడా ఈ కుంభమేళలో ప్రత్యేకంగా కన్పిస్తున్నారు. ప్రతి రోజు కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం కుంభమేళలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా యోగీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter