Full Emergency At Delhi Airport: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీ విధించారు. అందుకు కారణం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థకు చెందిన ఫ్రైట్ క్యారియర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొంది. దీంతో FX5279 నెంబర్ కలిగిన ఈ విమానం మళ్లీ ఢిల్లీకి తిరిగొచ్చింది. పక్షి ఢీకొన్న కారణంగా వెను తిరిగిన విమానంలో ఉన్న పైలట్ ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి ముందస్తు సమాచారం అందించారు.
ఫెడ్ఎక్స్ విమానం ఎయిర్‌పోర్టుకు వస్తున్న తీరు చూస్తే విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదనే నిర్ధారణకు వచ్చిన అధికారులు.. వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించి విమానాల రాకపోకలను పూర్తి కంట్రోల్ చేశారు. ఫెడ్ఎక్స్ విమానం ల్యాండింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసమే ఫుల్ ఎమర్జెన్సీ విధించినట్టు ఢిల్లీ ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
ఫెడ్ఎక్స్కి చెందిన బోయింగ్ 777-200LR విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయిన అనంతరం పూర్తిస్థాయిలో విమానం ఇంజన్ పనితీరును చెక్ చేసిన తరువాతే విమానాన్ని తిరిగి దుబాయ్ వెళ్లేందుకు అనుమతించారు. మధ్యాహ్నం 1.39 గంటల ప్రాంతంలో ఫెడ్ఎక్స్ విమానం దుబాయ్‌కి టేకాఫ్ అయినట్టు విమానం ట్రాకింగ్ డీటేల్స్ స్పష్టంచేస్తున్నాయి.
వాస్తవానికి విమానాల టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొనడం సర్వసాధారణం. అయితే, కొన్ని సందర్భాల్లో పక్షులు ఇంజన్లో చిక్కుకుని ప్రమాదాలకు దారీ తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్లే ఎప్పుడు ఏ విమానానికి పక్షి తగిలినా.. వెంటనే ఆ విమానాలను తిరిగి అదే విమానాశ్రయానికి కానీ లేదా సమీపంలోని విమానాశ్రయాలకు కానీ డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల సూరత్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానం కూడా పక్షి తగిలిన కారణంగా అహ్మెదాబాద్ విమానాశ్రయానికి డైవర్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన కారణంగా ఇంజన్‌లోని ఫ్యాన్ రెక్కలకు డ్యామేజీ జరిగింది అని డీజీసీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Kejriwal vs Gujarat High Court: ఆ డిగ్రీ నకిలీది కావచ్చు, గుజరాత్ తీర్పుపై అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి
ఇది కూడా చదవండి : Covid19 Cases in India: కలవరం కల్గిస్తున్న కోవిడ్19, గత 24 గంటల్లో 3 వేల కేసులు
ఇది కూడా చదవండి : Modi @ 20 Years Book: ప్రధాని మోదీ గురించి.. మోదీ @ 20 ఏళ్లు పుస్తకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK