Gold Price Today July 22nd 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ వస్తున్న ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 మేర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 మేర తగ్గింది. తగ్గిన ధరలతో ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం (జూలై 21) రూ.46,400 ఉండగా.. ఇవాళ అది రూ.46,000కి తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.50,620 ఉండగా.. ఇవాళ అది రూ.50,180కి చేరింది.
ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180గా ఉంది. విశాఖపట్నంలోనూ హైదరాబాద్, విజయవాడలో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.
ఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా నగరాల్లో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఈ 3 నగరాల్లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,500గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,250గా ఉంది.
పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180గా ఉంది.
ఈరోజుల్లో బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్‌గా ఎంచుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ధర ఏమాత్రం తగ్గినా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే బంగారం ప్యూరిటీని జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో మోసపోయే అవకాశం ఉంటుంది. ధరల విషయానికొస్తే.. ఈ నెల 6 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇవాళే బంగారం ధర దిగొచ్చింది. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని గమనించగలరు. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు తదితర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)
Also Read: Droupadi Murmu Becomes President: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook