/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Heavy Rains in Himachal Pradesh: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను మరోసారి వణికిస్తున్నాయి. ముఖ్యంగా హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం(Heavy Rains) సృష్టిస్తున్నాయి. మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పండోహ్ ప్రాంతంలో ఆ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వానలకు పలు చోట్ల కొండచరియలు(landslides) విరిగిపడి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ వర్షాలకు మండి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా కాలనీలను వరద నీరు ముంచెత్తింది. బిలాస్ పుర్ జిల్లాలోని కొండ చరియలు విరిగి పడుతున్నాయి. 

మరోవైపు మండి జిల్లాలోని సుందర్ నగర్ నుంచి సిమ్లా వెళ్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడగా.. మరో 8 మంది ప్యాసింజర్స్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సొలన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సిమ్లా-కల్కా మార్గంలో గల నేషనల్ హైవే-5ను మూసివేశారు. 

హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 12 & 13 తేదీల్లో 115.6 నుండి 204.4 మిమీ వరకు భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని సోలన్, సిమ్లా, సిర్మౌర్, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కాంగ్రా, మండి మరియు ఉనా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసినట్లు ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ బుయ్ లాల్ తెలిపారు. 

also read: Flying Kisses: రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిందెవరికి

హిమచల్ రాష్ట్రంలో జూన్ 24 నుండి ఆగస్టు 11 వరకు ఈ భారీ వర్షాలు(Heavy Rains in Himachal Pradesh) మరియు రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య 252కి చేరింది. ఇందులో కొండచరియలు విరిగి పడటం వల్ల 41 మంది, రోడ్డు ప్రమాదాల వల్ల 107 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 

also read: PM Modi Speech Highlights: అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సెటైర్లు.. కాంగ్రెస్ పార్టీకి గట్టి చురకలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Heavy Rains effect: Orange alert issued for Himachal Pradesh by IMD
News Source: 
Home Title: 

హిమాచల్‌లో కుండపోత వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..

Himachal Pradesh Rains: హిమాచల్‌లో కుండపోత వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..
Caption: 
image (twitter)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
హిమాచల్‌లో కుండపోత వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, August 12, 2023 - 19:56
Request Count: 
39
Is Breaking News: 
No
Word Count: 
266