కోల్‌కతా : చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోంచి తరచుగా నగదు మాయం ( Money withdrawn from dead man's account ) అవుతుండటంపై అయోమయానికి గురైన కుటుంబసభ్యులు ఈ మిస్టరీని ఛేదించాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 35 లక్షలు మాయం కావడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న డిటెక్టివ్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి.. ఎట్టకేలకు అసలు దొంగను పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాకాసిపురకు చెందిన రీటా రాయ్ అనే మహిళ అన్వర్‌షా రోడ్‌లోని ఓ ఇంట్లో గత ఏడేళ్లుగా పనిమనిషిగా ( Home maid ) పని చేస్తోంది. లాక్డౌన్ మొదలైన కొన్ని రోజులకే ఆ ఇంటి యజమాని మరణించాడు. అదే సమయంలో ఇంటి యజమాని ఏటీఎమ్ కార్డును ( ATM card theft ) దొంగిలించిన రీటా రాయ్.. గత రెండు నెలలుగా యజమాని ఖాతాలో ఉన్న డబ్బులను విత్ డ్రా చేసుకోవడం మొదలుపెట్టింది. అలా మొత్తం 35 లక్షల రూపాయల వరకు డబ్బులు డ్రా చేసుకుంది. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 కొత్త లోగో వచ్చేసింది
మొదట ఇది యజమాని కుటుంబసభ్యుల పనే అయి ఉంటుందని భావించిన పోలీసులు.. ఆ కోణంలో విచారించారు. అదే సమయంలో వారి దృష్టి ఇంటి పనిమనిషి రీటా రాయ్‌పై పడింది. దీంతో రీటాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు నేరం అంగీకరించింది. ఈ నేరంలో రీటాకు సహకరించిన ఇంకొందరిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 27 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు కోల్‌కతా పోలీసులు తెలిపారు.Also read : Jobs in ECIL: బీటెక్ పాసయ్యారా ? ఈ జాబ్ నోటిఫికేషన్ చూడండి