Monalisa Video: అయ్ పాయ్.. కుంభమేళను వదిలి వెళ్లిపోతున్న మోనాలీసా... ఎమోషనల్ వీడియో వైరల్..

Kumbh mela viral Girl: ప్రయాగ్ రాజ్ లో ఓవర్ నైట్ లో ఫెమస్ అయిన వైరల్ యువతి మోనాలీసా కుంభమేళను విడిచి తన గ్రామంకు వెళ్లిపోతుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 24, 2025, 04:52 PM IST
  • మోనాలీసా ఫ్యామిలీ సంచలన నిర్ణయం..
  • ఇంటికి వెళ్లిపోతున్న వైరల్ గర్ల్..
Monalisa Video: కుంభమేళను వదిలి వెళ్లి పోతున్న మోనాలీసా.. ఎమోషనల్ వీడియో వైరల్..

Kumbhmela viral girl Monalisa video: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ప్రతి రోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు.  ఇదిలా ఉండగా.. కుంభమేళలో కొంత మంది సాధులు, అఘోరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వీరితో పాటు ఐఐటీ బాబా, ఛోటు బాబా, హర్షరిచారియా, చన్ చల్ నాథ్ అఘోరీ, బాడీ బిల్డర్ బాబా, గోల్డ్ వాలే బాబా.. ఇలా అనేక మంది తెగ వైరల్ గా మారారు. ఇక ఇండోర్ కు చెందిన పూసలమ్మే ఒక యువతి  మోనాలీసా భోంస్లే మాత్రం తన తేనెకళ్లతో ఒక రేంజ్ లో ఫెమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు , ఫోటోలు తెగ హల్ చల్ చేశాయి. ఈమె తన నేచురల్ అందంతో ఒక్కసారిగా నెటిజన్ల మనస్సులు గెల్చుకున్నారు.

 

ఈ క్రమంలో ఏకంగా బాలీవుడ్ దర్శకుడు దిగొచ్చి తన తర్వాతి సినిమాలో మోనాలీసాకు అవకాశం ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు. మరోవైపు మోనాలీసా కుటుంబం కుంభమేళలో పూసలు, రుద్రాక్షలు, జపమాలల బిజినెస్ చేస్తుంటారు. ఈమె ఫోటోను, వీడియోలను ఫస్ట్ ఎవరు సోషల్ మీడియాలో వేశారో కానీ.. అప్పటి  నుంచి ఆమె గురించి యూట్యూబ్ ఛానెల్స్, మీడియా వాళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో.. చాలా సార్లు మోనాలీసా పట్ల కొంత మంది అతీగా ప్రవర్తించారు.

ఆమెను ఫోటోలు తీస్తు, సెల్ఫీలు దిగుతూ ఇబ్బందులకు గురిచేశారు. ఆమె ఎక్కడికి వెళ్లిన వెంట పడుతూ ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మోనాలీసాతో పాటు, ఆమె కుటుంబం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.  ఈ నేపథ్యంలో మోనాలీసా తాను కుంభమేళ వదిలి వెళ్లిపోతున్నట్లు ట్రైన్ లో ఒక వీడియోను సోషల్ మీడియా అకౌంట్ లో రిలీజ్ చేశారు.

Read more: Samantha: మహేష్ బాబు డ్రాప్ కావడం వల్లే.. చైతు, సమంత కమిట్ అయ్యారా..?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!.

తన గ్రామంకు వెళ్తున్నానని.. మీ ప్రేమకు, అభిమానానికి థైంక్స్ అనిచెప్పుకొచ్చారు. కుదిరితే.. మళ్లీ కుంభమేళలో కలుద్దామని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా.. తన ఫోటోలు, వీడియోలను మాత్రం షేర్ చేస్తు ఉండాలని తనను ఫాలో అవుతు ఉండాలని.. మీ అభిమానం నుఎల్లప్పుడు కోరుకుంటునే ఉంటానని మోనాలీసా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News