ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) 10,190 ఆఫీసర్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తులు పంపించడానికి ఆఖరు తేది జులై 2, 2018. ఈ పోస్టులలో సీనియర్ మేనేజరు పోస్టుకి వయోపరిమితి 21 నుంచి 40 సంవత్సరాలు. అలాగే స్కేల్ 2 మేనేజర్ పోస్టుకి వయోపరిమితి 21 నుంచి 32 సంవత్సరాలు.
అలాగే అసిస్టెంటు మేనేజరు పోస్టుకి వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు. ఆఫీస్ అసిస్టెంటు పోస్టుకి వయోపరిమితి 18 నుంచి 28 సంవత్సరాలు. ఈ పోస్టులకు దరఖాస్తులు పంపించాక, అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. తర్వాత మౌఖిక పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆన్ లైన్లో నిర్వహించే అవకాశం ఉండగా.. అది రెండు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) జరుగుతుంది.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్య్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరీక్షల్లో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, ఆఫీసర్ అభ్యర్థులకు జులై 30 నుంచి ఆగస్టు 4వ తేది వరకు జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ అభ్యర్థులకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆగస్టు 6 నుంచి 11వ తేది వరకు జరుగుతుంది.
ఆఫీసర్ స్కేల్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 11,12,18 తేదిలలో జరగ్గా, ఆఫీస్ అసిస్టెంటు అభ్యర్థులకు ప్రిలిమ్స్ ఆగస్టు 19,25, సెప్టెంబరు 1 తేదిల్లో జరుగుతుంది. ఈ పరీక్షల ఫలితాలు సెప్టెంబరులోనే వెలువడతాయి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్ సైట్ సందర్శించండి.