Summer Effect: వేసవి ప్రతాపం చూపిస్తోంది. తొలి నెలలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ఏడాది వేసవి ఆందోళన కల్గిస్తోంది. మార్చ్ నెల తొలివారంలోనే ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి నెలకొంది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జార్ఘండ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులుంటాయని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ము, విదర్భ, గుజరాత్ రాష్ట్రాల్లో రేపట్నించి ఉష్ణోగ్రత క్రమంగా పెరగుతుందని అంచనా. ఏప్రిల్ 3-6 మధ్యకాలంలో దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వేడిగాలులు తీవ్రంగా ఉంటాయని తెలుస్తోంది.
సాధారణ ఉష్ణోగ్రత 6.4 నాచెస్ కంటే ఎక్కువగా ఉంటే తీవ్రమైన హీట్ వేవ్ అంటారు. నిన్న ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 39.4 డిగ్రీల సెల్సియస్ నమైదైంది. ఇది సీజన్ సాధారణం కంటే ఆరు డిగ్రీలు అత్యధికం. ఇక పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది.
Also read: Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. వ్యాను లోయలో పడి 11 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook