Covid Cases: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోల్చితే 260 కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 15 వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 2549 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి రికవరీ అయినవారి సంఖ్య 4 కోట్ల 25 లక్షల 87 వేల 259కి చేరింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/WnHlfx5Hvz pic.twitter.com/PRqCE6nMPi
— Ministry of Health (@MoHFW_INDIA) May 18, 2022
దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.04 గా నమోదైంది. అటు రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 శాతంగా ఉండగా.. వారంతపు పాజిటివిటీ రేటు 0.57 శాతంగా రికార్డైంది. ఇప్పటివరకు 84 కోట్ల 49 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 4 లక్షల 34వేల 962 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. అటు దేశంలో 193 కోట్ల 53 లక్షల 58 వేల 865 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 17 కోట్ల డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయని తెలిపింది.
అటు అమెరికాలో మొత్తంగా ఇప్పటివరకు 8 కోట్ల 27 లక్షల 26వేల 107 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. వైరస్ సోకి 10 లక్షల 189 మృతి చెందారు.
Also Read: CNG Car Tips: వేసవిలో CNG వాహనదారులు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి!
Also Read: Beer Prices Hike: తెలంగాణలో మరింత ప్రియం కానున్న బీరు, 20 రూపాయల వరకూ పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook