Tamilnadu: ఆ ఐటీ కంపెనీ దాడుల్లో వేయి కోట్ల నల్లధనం

తమిళనాడులోని ఆ ఐటీ సంస్థ వ్యవహారం సంచలనంగా మారింది. ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో ఏకంగా వేయి కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్టు గుర్తించడం కలకలం రేపుతోంది.

Last Updated : Nov 7, 2020, 10:21 PM IST
Tamilnadu: ఆ ఐటీ కంపెనీ దాడుల్లో వేయి కోట్ల నల్లధనం

తమిళనాడులో ( Tamilnadu )ని ఆ ఐటీ సంస్థ ( IT Company ) వ్యవహారం సంచలనంగా మారింది. ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో ఏకంగా వేయి కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్టు గుర్తించడం కలకలం రేపుతోంది.

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ ( Income tax Department ) అధికారులు దాడులు నిర్వహించారు. ఒక ఐటీ సంస్థపై చేసిన దాడుల్లో ( Income tax department raids ) నిర్ఘాంతపోయే విషయం వెలుగుచూసింది. ఐటీ ఇన్ఫ్రా సంస్థపై చేసిన దాడుల్లో ఏకంగా వేయి కోట్ల నల్లధనం ( 1000 crores black money ) బయటపడింది. రాాష్ట్రంలోని చెన్నై, మధురలో ఉన్న ఆ ఐటీ సంస్థకు చెందిన 5 కార్యాలయాలపై ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ  దాడులు జరుగుతున్నాయి.

ఈ ఐటీ కంపెనీ.. సింగపూర్‌కు చెందిన కంపెనీలో కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. షేర్‌ హోల్డింగ్‌ కంపెనీకి ఉన్న రెండు సంస్థల్లోంచి ఒక సంస్థపై దాడి జరిగింది. 78 శాతం షేర్‌ హోల్డింగ్‌ ఉన్న మేజర్‌ సంస్థ సింగపూర్‌ కంపెనీలో చిన్నస్థాయిలో పెట్టుబడులు పెట్టగా, 28 శాతం షేర్‌ హోల్టింగ్‌ ఉన్న మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఈ సందర్భంగా బయటపడింది. తద్వారా ఆ కంపెనీ ఏడు కోట్ల సింగపూర్‌ డాలర్ల వరకూ లబ్ధి పొందినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు 2 వందల కోట్ల మేర విదేశీ ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని..ఈ విధంగా వేయి కోట్ల బ్లాక్ మనీ కూడబెట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు. Also read: Bihar Exit Poll Result 2020: బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2020, బీహార్ కొత్త సీఎం ఎవరు ?

Trending News